హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిష్క అగర్వాల్ సత్తాచాటింది. మొత్తం 14 దేశాలకు చెందిన జిమ్నాస్ట్లు పోటీపడ్డ జింపీస్ జిమ్నోవా కప్లో నిష్క వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకంతో మెరిసింది.
తొలిసారి సీనియర్ ఈవెంట్లో బరిలోకి దిగిన నిష్క అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుతం గాడియం స్పోర్టోపియాలో శిక్షణ తీసుకుంటున్న నిష్క్ర మరింత రాటుదేలేందుకు ప్రయత్నిస్తున్నది.