హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గురుకుల విద్యార్థిని శైలజ రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన బాలికల 80 మీటర్ల పరుగు పందెంలో శైలజ 10.43 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం చేజిక్కించుకుంది. డిండి అథ్లెటిక్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శైలజను కోచ్ పరుశురామ్‌తో పాటు ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ అభినందించారు.