Duleep Trophy : భారత యువ పేసర్ అకీబ్ నబీ(Auqib Nabi) దేశవాళీ క్రికెట్‌కు దూరమవ్వనున్నాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో నార్త్ జోన్ స్క్వాడ్‌లో అతడు కీలకమైన సెమీస్‌కు ముందే జట్టును వీడనున్నాడు. దాంతో, నార్త్ జోన్ సెలెక్టర్లు అతడి స్థానంలో ఇటీవలే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్(Gurnoor Brar)ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలో ఆకట్టుకున్న బ్రార్ సౌత్ జోన్‌తో సెమీఫైనల్లో ఆడనున్నరాడు. ఆదివారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సెమీస్ జరుగనుంది.
రంజీ ట్రోఫీలో జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి ఛాంపియన్‌గా నిలవడంలో కీలకమైన అకీబ్ నబీ దులీప్ ట్రోఫీకి దూరం కానున్నాడు. ఈమధ్యే టీమిండియా జెర్సీ వేసుకున్న అతడిని ఇంగ్లండ్‌కు పంపేందుకు బీసీసీఐ సన్నాహాలు చేయడమే అందుకు కారణం. పేస్ సంచలమైన అతడిని న్యూజిలాండ్ పర్యటనలో అస్త్రంగా ప్రయోగించాలనుకున్న భారత బోర్డు.. టెస్టుల్లో బౌలింగ్ సాధన కోసం కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడించాలని భావిస్తోంది.
Gurnoor Brar has been added to the North Zone squad for their Duleep Trophy semi-final against South Zone beginning on Sunday at the BCCI Centre of Excellence in Bengaluru
Meanwhile, Auqib Nabi is exploring a short stint in the English county circuit, subject to his visa… pic.twitter.com/wDH3KGwlzN
— Cricinfo (@cricinfo) August 29, 2026
దాంతో, నార్త్ జోన్ సెలెక్టర్లు స్క్వాడ్‌లో కీలక మార్పు చేశారు. తదుపరి మ్యాచ్‌లకోసం నబీ స్థానంలో గుర్నూర్ బ్రార్‌ను తీసుకున్నారు. ఆగస్టు 30 ఆదివారం సౌత్ జోన్‌తో సెమీస్‌లో అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కంబోజ్‌లతో కొత్త బంతిని పంచుకోనున్నాడీ పొడగరి పేసర్.
నార్త్ జోన్ స్క్వాడ్ : కన్హయ్య వధావన్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదొని(వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, ఆయుష్ డొసెజా, యశ్ ధుల్, కమ్రాన్ ఇక్బాల్, సనత్ సంగ్వాన్, అబిద్ ముష్తాక్, అన్షుల్ కంబోజ్, అర్జున్ శర్మ, నిషాంతు సంధు, అర్ష్‌దీప్, గుర్నూర్ బ్రార్, సునీల్ కుమార్, నిఖిల్ కశ్యప్, యుధ్వీర్ సిం