IPL 2024 | పాండ్యా స్థానానికి గట్టి పోటీ..? ఆ నలుగురిపై ఓ కన్నేసిన గుజరాత్
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయంతో అభిమానులను షాకిచ్చింది. అరంగేట్రంలోనే తమ జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ను ముంబై ఇండియన్స్‌కు అమ్మేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)ను అతడి వారసుడిగా ప్రకటించింది. ఇప్పుడు గుజరాత్.. పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే....
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఫ్రాంచైజీ సంచలన నిర్ణయంతో అభిమానులను షాకిచ్చింది. అరంగేట్రంలోనే తమ జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ను ముంబై ఇండియన్స్‌కు అమ్మేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)ను అతడి వారసుడిగా ప్రకటించింది. ఇప్పుడు గుజరాత్.. పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే నిఖార్సైన ఆల్‌రౌండర్ కోసం అన్వేషిస్తోంది. 17వ సీజన్ మినీ వేలంలో పాల్గొంటున్న శార్దూల్ ఠాకూర్, షారుక్ ఖాన్, మనీశ్ పాండే, ఒమర్జాయ్లపై ఆ ఫ్రాంచైజీ ఓ కన్నేసింది.
పదహారో సీజన్లో విఫలమైన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్(Shardhul Thakur)ను కోల్‌కతా నైట్ రైడర్స్ వదులుకుంది. దాంతో, అతడిని మినీ వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవాలని గుజరాత్ భావిస్తోంది. నిరుడు సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రూ.10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే.. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ఠాకూర్‌ను ఆడించే అవసరం పెద్దగా రాలేదు. ఇక ఆడిన 7 మ్యాచుల్లో ఈ ఆల్‌రౌండర్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో, అతడిని కోల్‌కతా రీటైన్ చేసుకోవాలనుకోలేదు.
శార్దూల్ ఠాకూర్

అఫ్గనిస్థాన్ యువ కెరటం అజ్మతుల్లా ఒమర్జాయ్(Azmatullah Omarzai) కూడా గుజరాత్ లిస్ట్‌లో ఉన్నాడు. ఈమధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో యంగ్‌స్టర్ అద్బుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మూడు హాఫ్ సెంచరీలతో కలిపి 353 పరుగులతో దుమ్మురేపాడు. అంతేకాదు బంతితోనూ రాణించి 7 వికెట్లు తీశాడు. దాంతో, అతడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ఈసారి మినీ వేలంలో అజ్మతుల్లా భారీ ధర పలికే అవకాశం ఉంది.
అజ్మతుల్లా ఒమర్జాయ్

పాండ్యా లాంటి ఫినిషర్ కోసం చూస్తున్న గుజరాత్.. మినీ వేలంలో షారుక్ ఖాన్(Sharkhu Khan)ను కొనుగోలు చేసే చాన్స్ ఉంది. ఆఖరి ఓవర్లలో దంచి కొట్టే షారుక్ గుజరాత్‌కు కొండంత బలం అవుతాడు. ఈ విధ్వంసక బ్యాటర్ 16వ సీజన్లో అంచనాలు అందుకోలేకపోయాడు. 14 మ్యాచుల్లో 156 రన్స్ చేశాడంతే. దాంతో, పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ అతడిని వేలానికి వదిలేసింది.
మనీశ్ పాండే

రెప్పపాటులో మ్యాచ్ గమనాన్ని మార్చగల బ్యాటర్లలో మనీశ్ పాండే ఒకడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన పాండే ప్రతి ఐపీఎల్ సీజన్లో నిలకడగా రాణిస్తున్నాడు. మిడిలార్డర్లో చెలరేగి ఆడగల పాండే జట్టుకు భారీ స్కోర్ అందిచగలడు. అయితే.. 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన మనీశ్ పాండే దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 10 మ్యాచుల్లో 160 పరుగులు మాత్రమే చేశాడు. అయితే.. తనదైన రోజున పాండే భారీ స్కోర్ చేయగల దిట్ట. అనుభవజ్ఞుడైన అతడిని వేలంలో సొంతం చేసుకునేందుకు గుజరాత్ పావులు కదుపుతోంది.
ఇవి కూడా చదవండి
-
Gangs of Godavari | ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.!
-
Funtastic | రామ్ పేరున్న వాళ్లంతా మా పార్టీకే ఓటు వేస్తారు.. కమలం పార్టీపై ఫన్టాస్టిక్ పంచ్
-
Chithha Movie | ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ‘చిన్నా’.. స్ట్రీమింగ్ ఏక్కడంటే.!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

