Funtastic | రామ్ పేరున్న వాళ్లంతా మా పార్టీకే ఓటు వేస్తారు.. కమలం పార్టీపై ఫన్టాస్టిక్ పంచ్
Funtastic | ఆత్మను నమ్మిన వాళ్లంతా మాకే ఓటేస్తారు. ఎందుకంటే ఆత్మల గురించి ఇప్పటి వరకు ఏ పార్టీ పట్టించుకోలేదు. మేం మాత్రమే పట్టించుకున్నాం. ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏం చేయలేదు అని చెప్పకుండా ఆత్మలను నమ్ముకున్నాం.'
Funtastic | టీవీ చర్చలో కమలం నేత జవదేక్ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఈసారి తెలంగాణలో కమలం వికాసాన్ని ఎవరూ ఆపలేరు? మేం 320 సీట్లలో విజయం సాధించబోతున్నాం అని మైకును గుద్ది చెప్పారు.
సార్ తెలంగాణలో ఉన్నవే 119 సీట్లు….
అంటే అధికార పక్షం సీట్లను కూడా కొట్టేశారా?
కొట్టేయడం కాదు సార్ 2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో 119 సీట్లే ఉన్నాయి .
అంటే మిగిలిన 250 సీట్లు ఆంధ్రాలో ఉన్నాయా?
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవే 294 సీట్లు. అందులో తెలంగాణలో 119 ఉంటే, ఆంధ్రాలో 175 సీట్లు.
నిజమా ?
ఔను సార్ రాష్ట్ర విభజనను, తెలంగాణ ఏర్పడడాన్ని మీరూ, మీ పార్టీ, మీ మోడీ ఇంకా జీర్ణం చేసుకోలేదు కాబట్టి రాష్ట్ర విభజన జరిగిందని కానీ, తెలంగాణ ఏర్పడిందని కానీ మీకు గుర్తులేదు.
పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు తెలంగాణకు ఏం చేశారో చెబుతారా?
ఇంటింటికీ మంచి నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ తాత్కాలికమైనవి.. వీటిపై మాకు నమ్మకం లేదు.
అంటే అన్ని రాష్ర్టాలకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినట్టు తెలంగాణకు పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటిస్తారా?
ఈ ప్రాజెక్ట్‌లు కూడా శాశ్వతమైనవి కాదు. మేం శాశ్వతంగా ఉండే వాటిపైనే దృష్టి పెడతాం.
మేం ఊహించలేక పోతున్నాం. తెలంగాణకు ఇచ్చే శాశ్వతమైనవేవో మీరే చెప్పండి ?
పుట్టిన మనిషి గిట్టక తప్పదు.. పుట్టాడు అంటేనే గిట్టే రోజు రాసి పెట్టుకొని వచ్చాడు అని అర్థం.
ఔను..మరి శాశ్వతం?
ఆత్మ శాశ్వతమైంది.. ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తే ఏమవుతుంది. అప్పటికప్పుడు దాహం తీరుతుంది. ఓ గంట అయ్యాక మళ్ళీ దాహం వేస్తుంది.
ఊరించకండి చెప్పండి?
ఆత్మ శాశ్వతమైనది.. మేం ఆత్మకు శాంతి కలిగే పనులు చేస్తాం.
సరే అవయినా చెప్పండి?
ఆత్మ కనిపించదు. మేం చేసేదీ మీకు కనిపించదు .
అంటే చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు అంటారు. మరి మీరు ఎలా గెలుస్తారు ?
రాంజెఠ్మలానీ, సీతారాం ఏచూరి, హిందూ ఎడిటర్ రామ్.. వీరంతా మమ్ములను తీవ్రంగా వ్యతిరేకించారు. ఐనా వీరి పేరులో రామ్ ఉంది..
ఉంటే ?
రామ్ పేరున్న వాళ్లంతా మా పార్టీకే ఓటు వేస్తారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా రాం పేరున్న వారు కనిపిస్తారు. మా గెలుపునకు ఇదే ఆధారం.
ఇదేం వాదన. ఐనా రామ్ పేరున్న వాళ్లంతా మీకే ఓటేస్తారా? వేసినా గెలవడానికి సరిపోతాయా?
ఆత్మను నమ్మిన వాళ్లంతా మాకే ఓటేస్తారు. ఎందుకంటే ఆత్మల గురించి ఇప్పటి వరకు ఏ పార్టీ పట్టించుకోలేదు. మేం మాత్రమే పట్టించుకున్నాం. ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏం చేయలేదు అని చెప్పకుండా ఆత్మలను నమ్ముకున్నాం.’
జనం మా గురించి ఏమనుకుంటున్నారు ?
ఆత్మల ప్రచారాన్ని నమ్మి మీకు ఓటేస్తే ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారు.
– మురళి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్షదీప్ సింగ్
Maatrubhumi Trailer: మాతృభూమి ట్రైలర్ రిలీజ్ చేసిన సల్మాన్ ఖాన్
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

