GT vs CSK : లీగ్ దశ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) పంజా విసిరింది. సొంతగడ్డపై బెబ్బెలిలా రెచ్చిపోయిన శుభ్‌మన్ గిల్ సేన చెన్నై సూపర్ కింగ్స్(CSK) ప్లే ఆఫ్స్ ఆశలను నేలమట్టం చేసింది. భారీ ఛేదనలో సిరాజ్(3-26) విజృంభణతో కుదేలైన సీఎస్కేను శివం దూబే(47) గట్టెక్కించేలా కనిపించినా.. రషీద్ ఖాన్(3-18) తిప్పేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా మారింది. రబడ(3-32) సైతం ఓ చేయి వేయగా గుజరాత్ 89 పరుగుల భారీ విజయాన్నందుకోగా ఐదుసార్లు ఛాంపియన్ ఉసూరుమంటూ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పంతొమ్మిదో సీజన్లో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ అదిరే ఆటతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఇంటికి పంపింది. అహ్మదాబాద్‌లో తొలుతు 229 రన్స్ కొట్టిన గుజరాత్ ప్రత్యర్థిని పడగొట్టింది. పేసర్ సిరాజ్(3-26) ఆదిలోనే చావుదెబ్బ తీశాడు. 230 పరుగుల భారీ ఛేదనకు దిగిన సీఎస్కే బ్యాటర్ల భరతం పడుతూ తొలి ఓవర్లోనే సంజూ శాంసన్(0)ను గోల్డె్న్ డక్‌గా ఔట్ చేశాడు మియా భాయ్. ఆ తర్వాతి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్(16), ఈ సీజన్లో వేగవంతమైన అర్ధ శతకంతో రికార్డు నెలకొల్పిన ఉర్విల్ పటేల్(0)ను వెనక్కి పంపిన సిరాజ్ మూడో వికెట్‌తో చెన్నైని పీకల్లోతు కష్టాల్లో నెట్టాడు.
Airborne and incredible ✈️
Ft. Shubman Gill 🦸♂️
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK pic.twitter.com/aZOiHlacdT
— IndianPremierLeague (@IPL) May 21, 2026
సిరాజ్ నిప్పులు చెరగడంతో 29 పరుగులకే మూడు వికెట్లు పడగా మాథ్యూ షార్ట్(19), కార్తిక్ శర్మ(24)లు క్రీజునంటుకునేందుకు ప్రయత్నించారు. కానీ, రబడ ఓవర్లో షార్ట్ ఔటవ్వగా .. 7వ ఓవర్లో గిల్ విసిరిన త్రోకు కార్తిక్ రనౌటవ్వగా చెన్నై 63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. చూస్తుండగానే ఐదుగురు డగౌట్ చేరగా శివం దూబే(47), బ్రెవిస్(8)లు భారీ ఓటమిని తప్పించేందుకు పోరాడారు.
Steaming in and HOW 🥵
Mohd. Siraj on a roll in Ahmedabad ⚡️
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK | @mdsirajofficial pic.twitter.com/MUr9XB6sYv
— IndianPremierLeague (@IPL) May 21, 2026
కీలక బ్యాటర్లు ఔటైన చోట దూబే సిక్సర్లతో హల్చల్ చేశాడు. హోల్డర్, అర్షద్ ఖాన్ ఓవర్లో దంచేసి చెన్నై స్కోర్ వంద దాటించాడు దూబే. అర్ధ శతకానికి చేరువైన అతడు రషీద్ ఖాన్(3-18) ఓవర్లో బంతిని గాల్లోకి లేపగా గిల్ వెనక్కి పరుగెడుతూ డైవింగ్ క్యాచ్ అందుకోగా ఆరో వికెట్ 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కంబోజ్(19) ఆట కట్టించిన రషీద్.. ప్రమాదకరమైన బ్రెవిస్‌ను ఔట్ చేసి చెన్నై ఓటమిని ఖాయం చేశాడు. 14వ ఓవర్లో రబడ(3-32) వరసగా నూర్ అహ్మద్, జాన్సన్‌ను ఔట్ చేయడంతో సీఎస్కే 140కే ఆలౌటయ్యింది. ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన గైక్వాడ్ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది.
WE ARE OUT OF WORDS! 🤯
Shubman Gill with Catch of the Season contender 🫡
Updates ▶️ https://t.co/p5TP9NLREX #TATAIPL | #KhelBindaas | #GTvCSK | @ShubmanGill pic.twitter.com/iuwx06Ln6B
— IndianPremierLeague (@IPL) May 21, 2026
గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ బ్యాటర్లు చితక్కొట్టారు. ఓపెనర్ సాయి సుదర్శన్(84) అర్ద శతకంతో కదం తొక్కగా శుభ్‌మన్ గిల్(64) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్సై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న ద్వయం శతక భాగస్వామ్యంతో జట్టను భారీస్కోర్‌కు పునాది వేసింది. ఆఖర్లో బట్లర్(57 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో సీఎస్కే ముందు కఠినమైన లక్ష్యాన్ని నిలిపింది గుజరాత్.