ఇండోర్: గుజరాత్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్(Urvil Patel).. టీ20ల్లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి వేగంగా సెంచరీ కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఏ-లిస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్లలో రెండవ వ్యక్తిగా నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ దేశవాళీ టీ20 క్రికెట్లో ఫాస్ట్‌గా సెంచరీ చేశాడు. 2018లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను సెంచరీ సాధించాడు.
ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ 27 బంతుల్లో నమోదు అయ్యింది. ఇస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్.. 27 బంతుల్లో సైప్రస్‌పై స్కోర్ చేశాడు. ఉర్విల్ పటేల్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాడు. 35 బంతుల్లో 113 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 10.2 బంతుల్లోనే గుజరాత్ చేజింగ్‌ను పూర్తి చేసింది.
రెండు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలో ఉర్విల్ పటేల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. గత ఏడాది కూడా ఉర్విల్ ఓ సెంచరీ చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.