గుజరాత్‌కు కావలసిన కీలక వికెట్‌ను రషీద్ ఖాన్ తీశాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పంజాబ్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టన్ (64)ను పెవిలియన్ చేర్చాడు. దొరికిన బంతిని దొరికినట్లే బాదేసిన లివింగ్స్టన్ 27 బంతుల్లోనే 64 పరుగులు చేశాడంటే ఏ రేంజ్లో బాదేశాడో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే 16వ ఓవర్లో బంతి అందుకున్న రషీద్ ఖాన్.. మూడో బంతికి లివింగ్స్టన్ వికెట్ తీశాడు.
రషీద్ వేసిన షార్ట్ పిచ్ బంతిని బాదేందుకు లివింగ్స్టన్ ప్రయత్నించాడు. కానీ బౌండరీని దాటించలేకపోయాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మిల్లర్ చక్కని క్యాచ్ అందుకొని లివింగ్‌స్టన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్ ఐదో బంతికి షారుఖ్ ఖాన్ (15) కూడా అవుట్ చేసిన రషీద్.. గుజరాత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు.
వరుసగా రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ జట్టు 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులతో నిలిచింది. ఇంకా నాలుగు ఓవర్ల ఆట మిగిలి ఉన్నప్పటికీ సరైన బ్యాటర్లు లేకపోవడంతో పంజాబ్ భారీ స్కోరు చేయడం కష్టంగా కనిపిస్తోంది.