టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వాళ్ల కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటైన కాసేపటికే.. భారీ అంచనాలతో బరిలో దిగిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో కూడా పెవిలియన్ చేరాడు. రెండు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించిన అతన్ని లోకీ ఫెర్గూసన్ పెవిలియన్ చేర్చాడు.
ఫెర్గూసన్ వేసిన బంతిని కీపర్ పక్క నుంచి వెనక్కు పంపడానికి బెయిర్‌స్టో ప్రయత్నించాడు. కానీ అది అతని గ్లవ్స్‌ను తాకి గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న తెవాటియా ముందుకు దూకి మంచి క్యాచ్ అందుకోవడంతో బెయిర్‌స్టో పెవిలియన్ బాట పట్టాడు. క్యాచ్ క్లీన్‌గా పట్టారా? లేదా? అని థర్డ్ అంపైర్ చెక్ చేయగా.. కరెక్ట్‌గానే క్యాచ్ అందుకున్నట్లు తేలింది. బెయిర్‌స్టో అవుటవడంతో లియామ్ లివింగ్స్టన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి పంజాబ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 43 పరుగులతో నిలిచింది.