భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ టైటన్స్ దూసుకెళ్తోంది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (6) విఫలమైనా కూడా మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (84 నాటౌట్) అద్భుతంగా ఆడుతున్నాడు. అతనికి జత కలిసిన కొత్త కుర్రాడు సాయి సుదర్శన్ (35) కూడా చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చాహర్ వేసిన పదిహేనో ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.
చాహర్ వేసిన గూగ్లీని అంచనా వేయలేకపోయిన సుదర్శన్.. సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ సరిగా కుదరకపోవడంతో బంతి గాల్లో బాగా ఎత్తుకు లేచింది. దాన్ని ఎక్స్ట్రా కవర్ వద్ద కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అద్భుతంగా అందుకోవడంతో సుదర్శన్ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రస్తుతం పదిహేను ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి ఇంకా 56 పరుగులు కావలసి ఉంది.