పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల ఛేజింగ్‌లో గుజరాత్ జట్టును ముందుండి నడిపించిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (96) సెంచరీ చేయకుండానే వెనుతిరిగాడు. మ్యాచ్ సగం నుంచి అలసిపోయినట్లు కనిపించిన గిల్.. 19వ ఓవర్ ఐదో బంతికి వెనుతిరిగాడు. రబాడ వేసిన బంతిని కవర్స్ మీదుగా తరలించేందుకు గిల్ ప్రయత్నించాడు.
కానీ షాట్లో సత్తువ లేకపోవడంతో బంతి ఎక్కువ దూరం వెళ్లలేదు. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కు సులభమైన క్యాచ్ వచ్చింది. దాన్ని అతను చక్కగా అందుకోవడంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ వికెట్‌తో గుజరాత్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.