AbhijeetGupta : భారత గ్రాండ్‌మాస్టర్, అర్జున అవార్డు గ్రహీత అభిజిత్ గుప్తా (AbhijeetGupta) తనకు న్యాయం చేయాలంటూ క్రీడామంత్రిత్వ శాఖను ఆశ్రయించాడు. ఒడిశా ఓపెన్ (Odisha Open) నిర్వాహకుల నుంచి తనకు రావాల్సిన ప్రైజ్‌మనీని ఇప్పించాలని అభిజిత్ కోరాడు. ఐదు నెలలు కావొస్తున్నా నిర్వాహకులు స్పందించడం లేదని వాపోయిన అభిజిత్.. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని క్రీడా మంత్రిత్వ శాఖకు విన్నవించుకున్నాడు.
ఒడిశా ఓపెన్-2026(పదహారో అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్ చెస్ ఫెస్టివల్) జనవరి 16 -24 మధ్య జరిగింది. ఈ టోర్నీలో అదరగొట్టిన అభిజిత్ గుప్తా విజేతగా అవతరించాడు. ఛాంపియన్‌గా నిలిచినందుకు అతడికి రూ.5.5 లక్షల నగదు బహుమతి దక్కాలి. కానీ, నిర్వాహకులు మాత్రం ఈ టోర్నీ ముగిసి ఐదు నెలలు కావొస్తున్నా ప్రైజ్‌మనీ ఇవ్వలేదు. తనకు రావాల్సిన డబ్బుల గురించి అఖిల భారత చెస్ సమాఖ్యకు, ఒడిశా ఓపెన్ నిర్వాహకులకు అభిజిత్ పలు మార్లు లేఖలు రాసినప్పటికీ న్యాయం జరుగలేదు. దాంతో.. విసుగొచ్చిన అతడు క్రీడా మంత్రిత్వ శాఖను సంప్రదించాడు.
As a sportsperson, you learn to accept losses more often than victories — that is part of the journey. But what hurts even more is winning and still not receiving what you rightfully earned.
I won the Odisha Open in January 2026. The organizers assured me that the prize money…
— Abhijeet Gupta (@iam_abhijeet) May 9, 2026
‘ఒక క్రీడాకారుడిగా విజయాల కంటే ఓటములను అంగీకరించడం నేర్చుకుంటాం. ఇదంతా క్రీడలో భాగం. కానీ, టోర్నీలో గెలిచిన తర్వాత ప్రైజ్‌మనీ అందుకోకపనోవడం మరింతగా బాధిస్తుంది. ఈ ఏడాది జనవరిలో నేను ఒడిశా ఓపెన్ గెలుపొందాను. ప్రైజ్‌మనీని నెల రోజుల్లో ఇస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. నెల గడిచినా నాకు నగదు బహుమతి ఇవ్వలేదు. ఇదేంటీ? అని అడుగబోతే నిర్వాహకులు స్పందించడం లేదు. అఖిల భారత చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో టోర్నీ జరిగినందున ఏఐసీఎఫ్ అధ్యక్షుడు, సెక్రటరీలను సంప్రదించాను. కానీ, దురదృష్టవశాత్తూ వారు కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు.
అర్జున అవార్డు గ్రహీతనైనా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో.. నేను ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలు గుర్తుకొస్తున్నాయి. అందుకని నాకు రావాల్సిన ప్రైజ్‌మనీ ఇప్పించాల్సిందిగా కేంద్ర యువజన మంత్రిత్వ, క్రీడా శాఖను అభ్యర్థిస్తున్నా. నాకు చెల్లించని డబ్బుల గురించే కాదు.. భారత్‌లోని ప్రతి చెస్ క్రీడాకారుల గౌరవం, నమ్మకాన్ని కాపాడం గురించి అని నేను మీకు తెలియజేస్తున్నా’ అని అభిజిత్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.