Shubman Gill : ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్ చేజారినా.. వన్డే సిరీస్ అయినా గెలుస్తామనుకుంటే అది కూడా అప్పగించేసింది భారత జట్టు. పసలేని బౌలింగ్ కారణంగా లార్డ్స్ వన్డే(Lords ODI)లో భారీ స్కోర్ సమర్పించుకున్న టీమిండియా.. రోహిత్ శర్మ శతకం కొట్టినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. 1-2తో సిరీస్ కోల్పోవడంపై మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తమ పరాజయానికి గాయాలూ ఓ కారణమని చెప్పాడు. ఆటగాళ్లు ఫిట్నెస్ను లైట్‌గా తీసుకోవడంపై గిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టుకు ఇంగ్లండ్ పెద్ద షాకిచ్చింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుపొంది టీమిండియా మేనేజ్మెంట్ను ఆలోచనల్లో పడేసింది. సిరీస్ మధ్యలో ఆటగాళ్లు గాయాల బారిన పడడం, పేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లించింది శుభ్‌మన్ గిల్ సేన. మ్యాచ్ అనంతరం ‘సిరీస్ ఓటమికి గాయాలూ ఓ కారణమా?’ అని విలేకరులు ప్రశ్నించగా ‘అవును’ అని బదులిచ్చాడు గిల్.
Shubman Gill has said India cannot afford to have players getting injured every few matches if they want to be a strong contender at the 2027 ODI World Cup pic.twitter.com/weLVFpSAyN
— Cricinfo (@cricinfo) July 20, 2026
తొలుత ప్రకటించిన స్క్వాడ్‌లోని ఐదుగురు లార్డ్స్ వన్డేలో ఆడలేదు. ఒకరు గాయపడితే మరొకరిని ఆడించడం, కాంబినేషన్లు మార్చడం తప్పలేదు. ఇద్దరు గాయపడితే.. మళ్లీ కొత్త కాంబినేషన్. ప్రతి మ్యాచ్ అనంతరం ఒకరు గాయపడితే.. మేము మ్యాచ్‌లో ట్రిక్ మిస్ అవుతున్నాం. వరల్డ్‌కప్‌ను తీసుకుంటే వరసగా 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఆటగాళ్లు సిరీస్‌లో 2-3 మ్యాచులు సైతం ఆడలేకుంటే ఎలా? మా ఆటగాళ్లు వరసగా మ్యాచ్‌లు ఆడలేకపోతుండంలో ఏదో పొరపాటు జరుగుతోంది.
🚨 SHUBMAN GILL’S HONEST ASSESSMENT OF INDIA’S ODI SERIES 🤯
– Our bowling attack is still inexperienced and we couldn’t handle the pressure in key moments.
– We went with an extra pacer as previous pitches didn’t assist spin, but in hindsight an extra spinner could have made… pic.twitter.com/Dvisxzji38
— Spotlight Central (@avbvikash1810) July 20, 2026
మ్యాచ్ రోజు ఉదయమే ఒకరు గాయంతో దూరమైతే.. మరొకరిని తీసుకోక తప్పదు. ఒకరు 80 శాతం ఫిట్‌గా ఉన్నా.. ఐదుగురు బౌలర్లతో ఆడాల్సి వచ్చినా గెలవడం కష్టం. ఒక గ్రూప్‌గా మేము ఫిట్‌నెస్‌లో తేలిపోతున్నాం. ఇవన్నీ మెరుగుపడాలి అని గిల్ పేర్కొన్నాడు. అలానే రోహిత్‌కు ఇదే ఆఖరి మ్యాచా? అతడి వీడ్కోలు ఎప్పుడు? అని ప్రశ్నించగా.. అతడు మాకేమి చెప్పలేదు అని గిల్ బదులిచ్చాడు.
లార్డ్స్‌లో బెన్ డకెట్(141) భారీ శతకానికి బెథెల్(91) అర్ధ శతకం, జో రూట్(74 నాటౌట్), జోస్ బట్లర్(41 నాటౌట్)ల పవర్ హిట్టింగ్తో 387 కొట్టిన ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఛేదనలో రోహిత్ శర్మ(138) సెంచరీ, విరాట్ కోహ్లీ(74) అర్థ శతకం బాదినా ఓటమి తప్పలేదు.