Euro Championship 2024 | స్వదేశంలో సాకర్ పండుగ.. యూ టర్న్ తీసుకున్న స్టార్ ఫుట్‌బాలర్
Euro Championship 2024 : ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్ ముందు జర్మనీ మిడ్‌ఫీల్డర్ టోని క్రూస్ (Tony Croos) రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. మూడేండ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన అతడు యూరో కప్(Euro Cup) 2024లో దేశం తరఫున...
Euro Championship 2024 : ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్ ముందు జర్మనీ మిడ్‌ఫీల్డర్ టోని క్రూస్ (Tony Croos) రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. మూడేండ్ల క్రితం ఆటకు వీడ్కోలు పలికిన అతడు యూరో కప్(Euro Cup) 2024లో దేశం తరఫున ఆడాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ‘ఫెడరల్ కోచ్ అభ్యర్థన మేరకు మళ్లీ జట్టులోకి వస్తున్నా’ అని క్రూస్ పోస్ట్ పెట్టాడు. దాంతో, జర్మనీలోని ఫుట్‌బాల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యూరో కప్ 2021లో ఇంగ్లండ్ చేతిలో జర్మనీ 2-0తో ఓడిపోయింది. ఆ ఓటమిని భరించలేక క్రూస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అక్కడితో అతడి కెరీర్ ముగిసిందని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా యూరో చాంపియన్‌షిప్ ముందు క్రూస్ మళ్లీ తెరపైకి వచ్చాడు.
Let’s do it! pic.twitter.com/eS13HQli7Z
— Toni Kroos (@ToniKroos) February 22, 2024
ఈ ఏడాది మార్చిలో నేను జర్మనీ తరఫున బరిలోకి దిగుతున్నా. ఫెడరల్ కోచ్ ఆహ్వానం మేరకు మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తా. ఈసారి జర్మనీ కప్పు కొడుతుందనే నమ్మకం ఉంది అని క్రూస్ తెలిపాడు. అనుభవజ్ఞుడైన క్రూస్ యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో జర్మనీకి కీలకం కానున్నాడు. జూన్ 14వ తేదీన యూరో కప్ ఆరంభం కానుంది. నెల రోజుల పాటు జర్మనీలో జరిగే ఈ సాకర్ పండుగ అభిమానులను ఎంతగానో అలరించనుంది.
ఇవి కూడా చదవండి
- Zeeshan Siddique | రాహుల్ గాంధీని కలవాలనుకుంటే.. ముందు బరువు తగ్గమన్నారు : జీషాన్ సిద్ధిఖీ
- Lasya Nanditha | అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు: మంత్రి కోమటిరెడ్డి
- Ravichandran Ashwin | ఇంగ్లండ్‌పై అశ్విన్ మరో ఘనత.. తొలి ఆసియా క్రికెటర్‌గా రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

