Imane Khelif | అల్జీరియా యువ బాక్సర్ ఇమానె ఖెలిఫ్ పారిస్ ఒలింపిక్స్లో పతకం పక్కా చేసుకుంది. గత కొన్ని రోజులుగా తన లింగనిర్ధారణపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విమర్శలకు పంచ్పవర్తో దీటైన సమాధానం చెప్పింది. అసలు నువ్వు మహిళనే కాదంటూ సోషల్మీడియాలో వెల్లువెత్తిన ఎత్తిపొడుపు మాటలకు ఖెలిఫ్ ఫుల్స్టాప్ పెట్టింది.
శనివారం జరిగిన మహిళల 66కిలోల క్వార్టర్స్ బౌట్లో ఖెలిఫ్ 5-0 తేడాతో హంగరీ బాక్సర్ అన్నా లుకా హమోరీపై అద్భుత విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్ బెర్తుతో ఒలింపిక్స్లో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. తన కెరీర్లో రెండో ఒలింపిక్స్ ఆడుతున్న ఇమానె ఖెలిఫ్కు ఇది తొలి పతకం కావడం విశేషం. తన తొలి పోరులో ఇటలీ బాక్సర్ ఎంజెలా కెరినీ మధ్యలో వైదొలుగడంతో ఖెలిఫ్పై విమర్శల పర్వం మొదలైన సంగతి తెలిసిందే.