UPWW vs GGW | అర్ధ శతకంతో మెరిసిన గార్డ్నర్.. రెండొందలు కొట్టిన గుజరాత్..!
UPWW vs GGW : మహిళా ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ రెండో మ్యాచ్‌లోనే రెండొందలు స్కోర్ నమోదైంది. గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ అషే గార్డ్నర్(65) అర్ధ శతకంతో మెరవగా.. అనుష్క శర్మ(44) యూపీ బౌలర్లను ఉతికేసింది.
UPWW vs GGW : మహిళా ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ రెండో మ్యాచ్‌లోనే రెండొందలు స్కోర్ నమోదైంది. గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) కెప్టెన్ అషే గార్డ్నర్(65) అర్ధ శతకంతో మెరవగా.. అనుష్క శర్మ(44) యూపీ వారియర్స్ బౌలర్లను ఉతికేసింది. వీరిద్దరూ ఔటయ్యాక టెయిలెండర్లు జార్జియా వరేహం(27 నాటౌట్), భారతి ఫుల్మలి(14 నాటౌట్)లు సైతం సిక్సర్లతో చెలరేగారు. దాంతో, నిర్ణీత ఓవర్లలో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్లో భారీ స్కోర్ బాదేసింది గుజరాత్ జెయింట్స్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్‌కు చుక్కలు చూపించి గుజరాత్ బ్యాటర్లు. ఓపెనర్లు బేత్ మూనీ(13), సోఫీ డెవినె(38)లు ఇచ్చిన శుభారంభాన్ని కెప్టెన్ అషే గార్డ్నర్(65), అనుష్క శర్మ(44)లు కొనసాగించారు. అయితే.. పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఔట్ కావడంతో గుజరాత్ 55 పరుగులకే రెండు బిగ్ వికెట్లు కోల్పోయింది. అయినా కూడా గార్డ్నర్, అనుష్కలు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదీ ద్వయం.
#GG Skipper Ashleigh Gardner on a roll 🧡
Updates ▶️ https://t.co/0Vl9vFyTyq#TATAWPL | #KhelEmotionKa | #UPWvGG pic.twitter.com/MYhAYcWJnF
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
బాదుడే పరమావధిగా పెట్టుకున్న వీరిద్దరూ వరల్డ్‌క్లాస్ బౌలర్లు దీప్తి శర్మ(2-32), ఎకిల్‌స్టోన్‌లను అలవోకగా ఎదుర్కొని.. విధ్వంసక ఆటతో గుజరాత్ స్కోర్ బోర్డును ఉరికించింది. టెయిలెండర్లు జార్జియా వరేహం(27), భారతి పుల్మాలి(14)లు కూడా బ్యాట్లకు పని చెప్పారు. వరేహం మూడు, భారతి రెండు సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీప్తి వర్మ వేసిన 20 వ ఓవర్లో భారతి వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో గుజరాత్ స్కోర్ రెండొందలు దాటింది. టాపార్డర్ మిడిలార్డర్ సమిష్టిగా రాణించగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 రన్స్ కొట్టింది.
I.C.Y.M.I
Power-packed shots 💪
Sophie Devine provided a quick-fire start with her stroke-filled 38(20) 👏
Updates ▶️ https://t.co/0Vl9vFyTyq#TATAWPL | #KhelEmotionKa | #UPWvGG | @Giant_Cricket pic.twitter.com/g7rIn8Sn5o
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

