IPL 2023 : చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(79 :47 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ,డేవాన్ కాన్వే(59 : 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొడుతున్నాడు. కీలక మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన వీళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఉతికారేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ ఓవర్లో సిక్స్ బాది డెవాన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అంతకుంముందు కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో గైక్వాడ్ దంచాడు. హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టాడు. దాంతో, చెన్నై స్కోర్ బోర్డు పరుగులు పెడుతోంది. 14 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా చెన్నై 140పరుగులు చేసింది.