పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వారు 21-16-21-14 స్కోరుతో మలేషియా ద్వయం మన్ వీ చాంగ్-కై వున్ తీపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-19, 12-21, 19-21తో డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ గెమ్కె చేతిలో ఓడిపోయాడు.