Arjuna Ranathunga | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శ్రీలంక దిగ్గజ సారథి.. 60 ఏండ్ల వయసులో ఇదేం ట్రాన్స్ఫర్మేషన్ బాబోయ్!
Arjuna Ranathunga | శ్రీలంక గెలిచిన తొలి, ఏకైక వన్డే ప్రపంచకప్‌ను అందించిన సారథి అర్జున రణతుంగ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తాజాగా కపిల్ దేవ్‌తో ఆయన దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
Arjuna Ranathunga | శ్రీలంక మాజీ సారథి, ఆ దేశానికి ఏకైక వన్డే వరల్డ్ కప్ అందించిన దిగ్గజం అర్జున రణతుంగ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. నిండైన ఆకారంతో బొద్దుగా ఉండే రణతుంగ.. పూర్తిగా బక్కచిక్కిపోయాడు. తాజాగా భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్‌తో కలిసి దిగిన ఫోటోలో రణతుంగను చూసినవారెవరైనా నోరెళ్లబెట్టక తప్పదు. గత కొంతకాలం దాకా అధిక బరువుతో ఇబ్బందిపడ్డ రణతుంగ.. 60 ఏండ్ల వయసులోనూ బాడీ ట్రాన్స్ఫామ్ అయిన విధానంపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
కపిల్ దేవ్‌తో ఉన్న ఫోటోలో రణతుంగను చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీరు గనక 90లకు చెందినవారు కాకుంటే కపిల్ దేవ్‌కు పక్కన నిలచున్న వ్యక్తెవరో కనిపెట్టలేరు’ అంటూ రాసుకొచ్చాడు. ‘అందరూ ఆయనను రణతుంగ అంటున్నారు. నేను ఆయన ఆడిన చాలా మ్యాచ్‌లను టీవీలో చూశాను. నేనైతే ఇది నమ్మడానికి సిద్ధంగా లేను. నేను చూసిన రణతుంగ వేరు.. ఆయనైతే కాదు..’ అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘ఒకవేళ ఆయన రణతుంగే అయితే ఆయనకు ఏమైంది?’ అంటూ స్పందిస్తున్నారు. ఏదేమైనా ఈ వయసులో రణతుంగ డెడికేషన్‌ను హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Two World Cup winning captains. pic.twitter.com/zJane9Oq0u
— Rex Clementine (@RexClementine) July 16, 2024
1996లో శ్రీలంక గెలిచిన తొలి, ఏకైక వన్డే వరల్డ్ కప్ రణతుంగ హయాంలో వచ్చిందే. 1982 నుంచి 2000 దాకా లంక తరఫున 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన రణతుంగ.. రెండు ఫార్మాట్లలో కలిపి 12వేలకు పైగా పరుగులు సాధించి 95 వికెట్లు పడగొట్టాడు. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక రాజకీయాల్లోకి వచ్చారు.
June 2022 😯😯 unbelievable transformation pic.twitter.com/iJzOY9gTZB
— He (@just_honestly_1) July 16, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

