Ramiz Raja : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) లంక ప్రీమయిర్ లీగ్( Lanka Premier League)లో అదరగొడుతున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో అతను కొలంబో స్ట్రయికర్స్‌ను గెలిపించాడు. అద్భుతంగా ఆడుతున్న ఆజాంపై పీసీబీ మాజీ అధ్యక్షుడు(Former PCB Chief) రమీజ్ రజా(Ramiz Raja) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కామెంటరీ బాక్స్‌లో ఉన్న అతను బాబర్ గురించి ఏం అన్నాడంటే..? బాబర్‌ను ప్రేమిస్తున్నా, అతడిని పెళ్లి చేసకోవాలని ఉంది అని రజా అన్నాడు. దాంతో, అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
HE REALLY SAID THAT😭 pic.twitter.com/BfFXicISpa
— faamia (@papukashmiri1) August 7, 2023
బాబర్ అజాం(Babar Azam) ఈమధ్యే అరుదైన ఫీట్ సాధించాడు. లంక ప్రీమియర్ లీగ్(Lanka Premier League)లో తొలి సెంచరీ కొట్టిన అతను టీ20ల్లో పదో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, పొట్టి క్రికెట్లో 10కి పైగా సెంచరీలు బాదిన వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(Chris Gayle) రికార్డు సమం చేశాడు. అయితే.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డు మాత్రం గేల్ పేరిటే ఉంది.
పొట్టి ఫార్మాట్లో బాబర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఈ స్టార్ ఆటగాడు 52 ఇన్నింగ్స్‌లోనే 2వేల పరుగులు కొట్టాడు. అంతేకాదు ఒక వరల్డ్ కప్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు, 303 పరుగులతో మరో రికార్డు నెలకొల్పాడు. నిరుడు బాబర్ సారథ్యంలోని పాక్ ఫైనల్ చేరింది. అయితే.. ఇంగ్లండ్ జట్టు చేతిలో అనూహ్యంగా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.