ముంబై: ముంబై టీ20 లీగ్‌లో మాజీ క్రికెటర్లు అభిషేక్ నాయర్, పారస్ మాంబ్రె మెంటార్లుగా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో మొదలుకానున్న లీగ్‌లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌కు నాయర్, ఏఆర్సీఎస్ అంధేరీ టీమ్‌కు మాంబ్రె మార్గదర్శకులుగా ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని ముంబై టీ20 లీగ్ శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. టీమ్ఇండియా కోచింగ్ బృందం నుంచి నాయర్‌ను బీసీసీఐ తప్పించగా, ప్రస్తుతం అతను ఐపీఎల్లో కోల్‌కతాకు సహాయక కోచ్‌గా పనిచేస్తున్నాడు.