Australian Open 2024 | గ్రాండ్‌స్లామ్ విజేతలకు గడ్డుకాలం.. క్వాలిఫయర్ రౌండ్ దాటుతారా..?
Australian Open 2024 : ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఈ టోర్నీతో రఫెల్ నాదల్(Rafeal Nadal), నొవామి ఒసాకా(Naomi Osaka) వంటి స్టార్లు పునరామనం చేస్తుండగా.. ఈసారి క్వాలిఫయర్‌లో ఇద్దరు గ్రాండ్‌స్లామ్ విజేతలు పోటీ పడుతుండడం...
Australian Open 2024 : ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఈ టోర్నీతో రఫెల్ నాదల్(Rafeal Nadal), నొవామి ఒసాకా(Naomi Osaka) వంటి స్టార్లు పునరామనం చేస్తుండగా.. టాప్ సీడ్స్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic), ఇగా స్వియాటెక్ టైటిల్‌పై కన్నేశారు. ఈసారి క్వాలిఫయర్‌లో ఇద్దరు గ్రాండ్‌స్లామ్ విజేతలు పోటీ పడుతుండడం విశేషం.
మహిళల విభాగంలో ఎమ్మా రాడుకాను(Emma Radukanu), పురుషుల సింగిల్స్‌లో డొమ్నిక్ థీమ్(Dominic Theim)లు క్వాలిఫయర్ బరిలో నిలిచారు. వీళ్లిద్దరూ యూఎస్ ఓపెన్ చాంపియన్లు కావడం విశేషం. నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేత అలినా కొర్నీవా కూడా క్వాలిఫయర్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
BIG names confirmed for AO 2024 qualifying 👀https://t.co/TsML21QoNX
— #AusOpen (@AustralianOpen) December 22, 2023
రెండేండ్ల క్రితం క్వాలిఫయర్ రౌండ్లో అదరగొట్టిన రాడుకాను యూఎస్ ఓపెన్‌కు అర్హత సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆమె ఏకంగా ట్రోఫీనే ఎగరేసుకుపోయింది. ఫైనల్లో కెనడాకు చెందిన లేలాహ్ ఫెర్నాండేజ్‌ను 6-4, 6-3తో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. అయితే.. నిరుడు ఏప్రిల్‌లో గాయాల బారిన పడిన రాడుకాను దాదాపు ఏడాది కాలంగా రాకెట్ ముట్టలేదు. మణికట్టు, కాలిమడిమ సర్జరీల తర్వాత కోలుకున్న ఆమె ఈమధ్యే కోర్టులో అడుగుపెట్టింది.
రఫెల్ నాదల్, నొవామి ఒసాకా

మాజీ వరల్డ్ నంబర్ 3 అయిన థీమ్ కూడా మణికట్టు గాయంతో కొన్ని రోజులు ఆటకు దూరమయ్యాడు. ఈ మధ్యే పునరాగమనం చేసిన థీమ్ ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగింట గెలిచాడు. అంతేకాదు ఈ యువకెరటం ప్యారిస్ మాస్టర్స్‌లో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత స్టాన్ వావ్రింకాను మట్టికరిపించాడు.
ఇవి కూడా చదవండి
- Dunki Movie | రికార్డు ధరకు అమ్ముడుపోయిన ‘డంకీ’ ఓటీటీ రైట్స్.!
- Road accident | ప్రాణం తీసిన వేగం.. రాయదుర్గంలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Virat Kohli: స్వదేశానికి కోహ్లీ.. సిరీస్ నుంచి రుతురాజ్ ఔట్.. తొలి టెస్టుకు ముందే భారత్‌కు వరుస షాకులు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

