Dunki Movie | రికార్డు ధరకు అమ్ముడుపోయిన ‘డంకీ’ ఓటీటీ రైట్స్.!
Dunki Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'డంకీ' (Dunki). రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది.
Dunki Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘డంకీ’ (Dunki). రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్లు అందుకున్న షారుఖ్ డంకీ సినిమాతో హ్యట్రిక్ కొట్టాడు.
ఇదిలావుంటే.. ఈ సినిమాకు ఓటీటీకి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం జియో సినిమాస్ రూ.155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో రికార్డు ధరకు డంకీ ఓటీటీ రైట్స్ పోవడంతో షారుక్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పంజాబ్‌లోని ఓ చిన్న గ్రామంలో నలుగురు స్నేహితులు ఇంగ్లండ్ వెళ్ళాలి అనుకుంటారు. అయితే వారు వెళ్లడానికి డబ్బు కానీ, వీసాలకి తగినంత చదువు కానీ ఉండదు. ఈ క్రమంలోనే ఆ ఊరికి వచ్చిన హార్డీ సింగ్ (షారుక్ ఖాన్) వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఇంగ్లండ్ తీసుకెళుతానని చెబుతాడు. దీనికోసం హార్డీ ప్రణాళికలు చేస్తాడు. అయితే ఈ ఐదుగురిలో ఒకరికి మాత్రమే వీసా వస్తుంది. మిగిలినవారికి దారులు మూసుకుపోతాయి. ఈ క్రమంలోనే వారు ఇంగ్లండ్ వెళ్లడానికి అక్రమ మార్గం ఎంచుకుంటారు. దొంగతనంగా డంకీ ట్రావెల్ ద్వారా లండన్‌కు వెళ్లాలి అనుకుంటారు. మరి వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది? ఈ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అసలు వాళ్ళు లండన్ కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? అనేది అసలు కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

