లండన్: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) లో అర్సెనల్ ఫ్రాంచైజీకి ఆడిన ప్రముఖ ఫుట్‌బాలర్ కెవిన్ క్యాంప్‌బెల్ (54) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మరణించినట్టు అర్సెనల్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడిస్తూ మాజీ ఆటగాడికి సంతాపం ప్రకటించింది. 18 ఏండ్ల వయసులోనే 1985లో అర్సెనల్ తరఫున అరంగేట్రం చేసిన క్యాంప్‌బెల్ స్ట్రైకర్‌గా గుర్తింపు పొందారు. అర్సెనల్‌తో పాటు ఎవర్టన్, నాటింగ్‌హామ్ క్లబ్‌లకూ ప్రాతినిథ్యం వహించి 542 మ్యాచ్‌లలో 148 గోల్స్ సాధించారు.