బ్యాంకాక్ : అండర్-19 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ఐదుగురు యువ బాక్సర్లు సెమీస్ చేరారు. గురువారం జరిగిన పోటీల్లో ఐదుగురు బాక్సర్లు క్వార్టర్స్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి సెమీస్ చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు.
పురుషుల విభాగంలో శివమ్ (55 కిలోలు), మౌసమ్ సుహాగ్ (65 కి.), రాహుల్ (75 కి.), గౌరవ్ (85 కి.), హేమంత్ (90 కి.) సెమీస్ చేరారు. అండర్-22 విభాగాల్లో భారత్ ఇప్పటికే 13 పతకాలు ఖాయం కాగా 19 కేటగిరీలోనూ 12 మెడల్స్ ఖాయమయ్యాయి.