కోపెన్‌హాగెన్: ఆట శత్రువులను కూడా దగ్గర చేస్తుందని అంటారు. అంతటి శక్తి స్పోర్ట్స్‌కు ఉంది. ఆటల్లో ఓ దేశ అభిమాని మరో దేశ అభిమానిని శత్రువుగా చూసే సందర్బాలు ఎన్నో చూశాం. ఫుట్‌బాల్‌లో అయితే ఏకంగా రెండు దేశాల అభిమానులు తన్నుకోవడమూ సాధారణమే. కానీ అలాంటి ఫుట్‌బాల్‌లో తాజాగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. యూరోకప్ 2020 గ్రూప్ బిలో భాగంగా ఫిన్లాండ్, డెన్మార్క్ మధ్య మ్యాచ్‌లో జరిగిన ఈ అపురూప ఘట్టం స్పోర్ట్స్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అసలేం జరిగింది?
ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్‌లోనే డెన్మార్క్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ ఎరిక్సన్ గాయపడ్డాడు. గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. అతన్ని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సమయంలో అతన్ని కెమెరాల కంటి కనిపించకుండా డెన్మార్క్ ప్లేయర్స్ అంతా రక్షణగా చుట్టూ నిలిచారు. ఇది చూసిన ఫిన్లాండ్ అభిమానులు తమ చేతుల్లోని రెండు జాతీయ పతాకాలను వాళ్లకు ఇచ్చారు. వాటిని అడ్డుగా పెట్టి ఎరిక్సన్ను మైదానం బయటకు తీసుకెళ్లారు.
ఫిన్లాండ్ అభిమానుల ఔదార్యం ఫుట్‌బాల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ట్విటర్లో ఆ ఫ్యాన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఆ ప్లేయర్‌ను బయటకు తీసుకెళ్తున్న సమయంలో రెండు దేశాల అభిమానులు క్రిస్టియన్, ఎరిక్సన్ అంటూ అరిచారు. ఈ మ్యాచ్‌లో చివరికి 1-0 తేడాతో ఫిన్లాండ్ విజయం సాధించింది. సెకండాఫ్‌లో ఆ టీమ్ ప్లేయర్ జోయెల్ పోజాన్పాలో గోల్ చేశాడు.
Prayers for Christian Eriksen 🙏
— Nigel D'Souza (@Nigel__DSouza) June 12, 2021
Finland fans gave their flags after Christian Eriksen collapsed during the match 🇫🇮
Wishing him speedy recovery. pic.twitter.com/LZ3hSn4Gka
Brilliant footage of the Finland fans chanting “Christian” and the Danes responding “Eriksen”
— Niall McCaughan (@niallmccaughan) June 12, 2021
Fingers crossed for the best possible outcome from all this https://t.co/luCAag9yJt