శాంటిగో (చిలీ) : ఎఫ్ఐహెచ్ మహిళల జూనియర్ వరల్డ్ కప్‌లో ఇప్పటికే క్వార్టర్స్ రేసు నుంచి నిష్క్రమించిన భారత హాకీ జట్టు.. క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో గెలిచి టాప్-10లో నిలిచేందుకు మార్గం సుగమం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్.. 3-1తో వేల్స్‌ను ఓడించింది.
హినా బానో (14వ నిమిషంలో), సునెలిట (24), ఇషికా (31) తలా ఓ గోల్ చేయగా ప్రత్యర్థి జట్టు నుంచి ఎలొయిస్ (52) ఒక గోల్ కొట్టింది. ఈ టోర్నీలో భారత జట్టు మంగళవారం ఉరుగ్వేతో తమ ఆఖరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ టోర్నీని టాప్-10తో ముగిస్తుంది.