FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్ ముగిసినా.. స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనను, సంచలన విజయాలను, గోల్స్ రికార్డులను అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈ మెగా టోర్నీని జీ5 చానెల్లో జోరుగా వీక్షించిన ఫ్యాన్స్.. ఓటీటీలో మాత్రం రెప్పవాల్చకుండా చూసేశారట. తాజాగా ఒర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ ర్యాంకింగ్స్(Ormax StreamView rankings)లో ఈ విషయం బయటపడింది. ఫిఫా వరల్డ్‌కప్ పోటీలకు ఓటీటీలో అత్యధిక వ్యూస్ వచ్చాయని, ఏకంగా 1.5 కోట్లమంది సాకర్ పండుగను వీక్షించి మురిసిపోయారని ఈ ర్యాంకింగ్స్ పేర్కొంది.
అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఫిఫా వరల్డ్‌కప్‌ను భారతీయులు తెగ చూశారు. లియోనల్ మెస్సీ, కిలియన్ ఎంబాపే, క్రిస్టియానో రొనాల్డో.. వంటి స్టార్ ఆటగాళ్లు పోటీపడిన ఈ ఈవెంట్‌ను కళ్లార్పకుండా చూశారు. టీవీలో, ఓటీటీలో.. తమ సౌకర్యాన్ని బట్టి ఈ మెగా టోర్నీని వీక్షించారని ఒర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ ర్యాంకింగ్స్ తెలిపింది. జూలై 13-19 .. ఈ చివరి వారంలో ప్రపంచకప్ పోటీలకు సాధారణం కంటే 40 శాతం వీక్షణలు అధికంగా వచ్చాయట.
When world-class sport meets millions of passionate fans.
Ranked India’s #1 most-watched OTT property by Ormax Media (July 13–19, 2026), Zee5’s FIFA World Cup 2026™️ coverage turned the nation’s love for football into an unforgettable viewing experience.
Thank you to every fan… pic.twitter.com/IOafll4bXY
— ZEE (@ZEECorporate) July 22, 2026
అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకూ జరిగిన మ్యాచ్‌లను ఎంతో ఉత్సాహంగా అభిమానులు చూశారని ఒర్మాక్ స్ట్రీమ్‌వ్యూ ర్యాంకింగ్స్‌తో వెల్లడైంది. జూలై 1 నుంచి జూలై 19 మధ్య జీ5లో వరల్డ్‌కప్‌లను చూసేవారి సంఖ్య 79 శాతం పెరిగిందని ఈ ర్యాంకింగ్స్ ద్వారా స్పష్టమైంది. జూలై 13-19 మధ్య జియో హాట్‌స్టార్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్‌ను 1.37 కోట్ల మంది చూశారు.
ఇదే వారంలో ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 2కు 90 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సాధారణంగా అన్ని ఆటల కంటే క్రికెట్‌కే అధిక ప్రాధాన్యమిచ్చే భారతీయులు.. ఫుట్‌బాల్‌ను ఈ రేంజ్లో ఆస్వాదించడం నిజంగా వండరే.

లీగ్ దశనుంచి ఆద్యంతం సంచలనాలతో రంజుగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో స్పెయిన్(Spain) విజేతగా నిలిచింది. జూలై19, ఆదివారం న్యూ జెర్సీ మైదానంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను(Argentina) 0-1తో ఓడించిన యూరప్ జట్టు.. రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.