FIFA World Cup 2026 | రేపటి నుంచే నాకౌట్.. 32వ రౌండ్లో 32 జట్లు ఇవే..!
FIFA World Cup 2026 : ఆద్యంతం సందడిగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో గ్రూప్ దశ ముగిసింది. 32వ రౌండ్లో చివరి రెండు స్థానాలు ఖరారవ్వడంతో నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది.
FIFA World Cup 2026 : ఆద్యంతం సందడిగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026లో గ్రూప్ దశ ముగిసింది. 32వ రౌండ్లో చివరి రెండు స్థానాలు ఖరారవ్వడంతో నాకౌట్ మ్యాచ్‌లకు తెరలేవనుంది. 13 గ్రూప్‌ల నుంచి నాకౌట్‌కు అర్హత సాధించిన 32 జట్లు హోరాహోరీ పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. జూన్ 29 సోమవారం కెనడా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో 32వ రౌండ్ మొదలవ్వనుంది.
లీగ్ దశలోనే రికార్డు గోల్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన ఫిఫా వరల్డ్‌కప్‌లో నాకౌట్ బెర్తులు ఖరారయ్యాయి. ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో నువ్వానేనా అన్నట్టు తలపడిన అల్జీరియా, ఆస్ట్రియాలు 3-3తో డ్రా చేసుకున్నాయి. దాంతో, ఇరుజట్లు 32వ రౌండ్‌కు అర్హత సాధించాయి. లీగ్ దశ పూర్తవ్వడంతో నాకౌట్ సమరానికి జూన్ 29 సోమవారంతో తెరలేవనుంది. 12 గ్రూప్‌ల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచినవి(24 జట్లు).. ఉత్తమ ర్యాంక్‌తో మూడో స్థానం సాధించిన 8 జట్లు.. కలిపి 32 టీమ్‌లు నాకౌట్ బరిలో ఉన్నాయి.
The Round of 32 is set. 🔐#FIFAWorldCup pic.twitter.com/viM72iNjw3
— FIFA World Cup (@FIFAWorldCup) June 28, 2026
32వ రౌండ్ ఇలా
అదిరే ఆటతో లీగ్ దశ దాటిన 32 జట్లు నాకౌట్ సమరంలోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాయి. జూన్ 29 సోమవారం జరిగే తొలి మ్యాచ్‌లో అతిథ్య కెనడాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. భారత కాలమానం(IST) ప్రకారం ఉదయం 12:30 గంటలకు ఈ మ్యాచ్ ఉంటుంది.
జూన్ 29, సోమవారం – కెనడా vs దక్షిణాఫ్రికా ఉదయం 12:30 గంటలకు.
జూన్ 29, సోమవారం – బ్రెజిల్ vs జపాన్ రాత్రి 10:30 గంటలకు.
జూన్ 30, మంగళవారం – జర్మనీ vs పరాగ్వే ఉదయం 2:30 గంటలకు.
జూన్ 30, మంగళవారం – నెదర్లాండ్స్ vs మొరాకో ఉదయం 6:30 గంటలకు.
జూన్ 30, మంగళవారం- ఐవరీ కోస్ట్ vs నార్వే రాత్రి 10:30 గంటలకు
Round of 32 action kicks off here 🤩#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 28, 2026
జూలై 1, బుధవారం – ఫ్రాన్స్vs స్వీడెన్ – ఉదయం 2:30 గంటలకు
జూలై 1, బుధవారం – మెక్సికో vs ఈక్వెడార్ ఉదయం 6:30 గంటలకు
జూలై 1, బుధవారం – ఇంగ్లండ్ vs డీఆర్ కాంగో రాత్రి 9:30 గంటలకు
జూలై 2, గురువారం – బెల్జియం vs సెనెగల్ ఉదయం 1:30 గంటలకు
జూలై 2, గురువారం – యూఎస్ఏ vs బోస్నియా హెర్జెగొవినా ఉదయం 5:30 గంటలకు
Three wins from three 👊#FIFAWorldCup pic.twitter.com/LMNuisDEqK
— FIFA World Cup (@FIFAWorldCup) June 28, 2026
జూలై 3, శుక్రవారం – స్పెయిన్ vs ఆస్ట్రియా ఉదయం 12:30గంటలకు
జూలై 3, శుక్రవారం – పోర్చుగల్ vs క్రొయేషియా ఉదయం 4:30 గంటలకు
జూలై 3, శుక్రవారం – స్విట్జర్లాండ్ vs అల్జీరియా ఉదయం 8:30 గంటలకు
జూలై 3, శుక్రవారం – ఆస్ట్రేలియా vs ఈజిప్ట్ రాత్రి 11:30 గంటలకు
జూలై 4, శనివారం – అర్జెంటీనా vs కాబొ వెర్డె ఉదయం 3:30 గంటలకు
జూలై 4,శనివారం – కొలంబియా vs ఘనా ఉదయం 7:00 గంటలకు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

