FIFA : ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య అర్జెంటీనా(Argentina)కు భారీ జరిమానా విధించింది. ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ అనంతరం మైదానంలో గొడవపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిఫా.. లియోనల్ మెస్సీ బృందానికి రూ.3.64 కోట్ల ఫైన్ వేసింది. అంతేకాదు అకారణంగా స్పెయిన్ ఆటగాళ్లతో గొడవ పడినందుకు పలువురిపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది.
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ అనంతరం మైదానంలో రచ్చ చేసినందుకు అర్జెంటీనా జట్టుకు ఫిఫా షాకిచ్చింది. జూలై 19న టైటిల్ పోరులో స్పెయిన్ చేతిలో ఓటమి తర్వాత లియోనల్ మెస్సీ బృందం హద్దులు మీరడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫిఫా భారీ జరిమానా విధించింది.
❗️FIFA fines Argentina $321,000 over supporters’ WC racism
$100,000 ‘must be invested in a plan to combat discrimination’
Paredes BANNED 10 games, fined $90K as 3 other players suspended over violent behavior during Spain final pic.twitter.com/i1xnyynBtE
— RT (@RT_com) August 21, 2026
అర్జెంటీనా ఆటగాళ్లు క్రమశిక్షణ ఉల్లంఘించినందున ఆ దేశ ఫుట్‌బాల్ సంఘానికి రూ.3.64 కోట్ల ఫైన్ వేసింది. ఫైనల్ తర్వాత స్పెయిన్ ఆటగాళ్లతో గొడవ పడినందుకు అర్జెంటీనా స్క్వాడ్, కోచింగ్ సిబ్బందిలోని పలువురిని సస్పెండ్ చేసింది ఫిఫా. అలానే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విక్టరీ అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లు ది ఫాల్క్‌లాండ్స్ అర్జెంటీనావే అని రాసున్న బ్యానర్‌ను ప్రదర్శించడాన్ని కూడా క్రమశిక్షణ ఉల్లంఘనగా ఫిఫా పేర్కొంది.
Argentina was fined $321,000 over chants, fights and misconduct
FIFA fined the Argentine Football Association for racist abuse, discriminatory chants and unsporting behavior.
Leandro Paredes was suspended for 10 matches and fined $90,000. Nahuel Molina and Thiago Almada were… pic.twitter.com/MLnGDOYv5V
— NEXTA (@nexta_tv) August 21, 2026
ప్రపంచకప్ స్క్వాడ్‌లోని మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పరేడ్స్, డిఫెండర్ నహుల్ మొలినా, థియగాఓ అల్మదలు మ్యాచ్ నిషేధానికి గురయ్యారు. వీరిలో పరేడ్స్పై 10 మ్యాచ్‌ల నిషేధం, భారీఫైన్ పడింది. మొలినా ఏడు మ్యాచ్‌లకు, అల్మద ఒక మ్యాచ్‌కు దూరం కానున్నారు. అలానే స్పెయిన్ ఆటగాడు గవిను ఒక మ్యాచ్‌కు సస్పెండ్ చేసింది ఫిఫా.