Roger Federer | ‘మీ ఆట అద్భుతం’.. వేల్స్ యువరాణిని ప్రశంసించిన ఫెదరర్
Roger Federer - Kate Middleton : ఒకరేమో యువరాణి .. మరొకరు టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడు. వీళ్లిద్దరూ కలిసి రాకెట్ పట్టారు. ఇంకేం వీళ్ల ఆట చూసి ప్రపంచమంతా మురిసిపోయింది. అవును... వేల్స్ యువరాణి(Princess of Wales) కేట్ మిడిల్టన్(Kate Middleton), రోజర్ ఫెదరర్(Roger Federer)తో కలిసి టెన్నిస్ ఆడారు. వీళ్లిద్దరూ అసలు ఎక్కడ టెన్నిస్ ఆడారో తెలుసా..? వింబుల్డన్ చాంపియన్‌షిప్(Wimbledon Championship) ట్రైనింగ్ సెషన్‌కు...
Roger Federer – Kate Middleton : ఒకరేమో యువరాణి .. మరొకరు టెన్నిస్‌లో దిగ్గజ ఆటగాడు. వీళ్లిద్దరూ కలిసి రాకెట్ పట్టారు. ఇంకేం వీళ్ల ఆట చూసి ప్రపంచమంతా మురిసిపోయింది. అవును… వేల్స్ యువరాణి(Princess of Wales) కేట్ మిడిల్టన్(Kate Middleton), రోజర్ ఫెదరర్(Roger Federer)తో కలిసి టెన్నిస్ ఆడారు. వీళ్లిద్దరూ అసలు ఎక్కడ టెన్నిస్ ఆడారో తెలుసా..? వింబుల్డన్ చాంపియన్‌షిప్(Wimbledon Championship) ట్రైనింగ్ సెషన్‌కు వెళ్లిన మిడిల్టన్, ఫెదరర్ అక్కడ బాల్ బాయ్స్, బాల్ గర్ల్స్ను కలిశారు.
అప్పుడు ఫెదరర్, యువరాణితో ‘మనం టెన్నిస్ ఆడదామా?’ అని అడిగాడు. దానికి ఆమె ‘ఓకే’ అంది. ఇద్దరూ రెండు బృందాలుగా విడిపోయా డబుల్స్ మ్యాచ్ ఆడారు. అంతలోనే మిడిల్టన్ లైన్ వద్ద ఒక పాయింట్ సాధిస్తుంది. ఆమె ఆ షాట్ ఆడడం చూసి ఫెదరర్ ఫిదా అవుతాడు. ‘బంతి లైన్‌పై పడిందనుకుంటా. అద్భుతంగా ఆడారు’ అని యువరాణిపై ప్రశంసలు కురిపిస్తాడు. ఈ వీడియోను వింబుల్డన్ నిర్వహాకులు యూట్యూబ్ చానెల్(Youtube Channel)లో పెట్టారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.
వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ – రోజర్ ఫెదరర్
20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
టెన్నిస్‌లో తిరుగలేని ఆటగాడిగా పేరొందిన ఫెదరర్ ఏడాది క్రితం ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఈ స్విస్ సొగసరి ఆటగాడి ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. తనకెంతో ఇష్టమైన వింబుల్డన్ (గ్రాస్ కోర్టు)లో అతను అత్యధికంగా 8 టైటిళ్లు గెలిచాడు. రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్‌తో పోటీపడి మరీ టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. అయితే.. వయసు మీద పడడం, గాయాలు వేధిస్తుండంతో ఫెదరర్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు.
ఇవి కూడా చదవండి
Roger Federer | ‘మీ ఆట అద్భుతం’.. వేల్స్ యువరాణిని ప్రశంసించిన ఫెదరర్
Jasprit Bumrah | నెట్స్‌లో చెమటోడ్చుతున్న బూమ్రా.. జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్న స్పీడ్‌స్టర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

