ఏషియా ఎయిర్‌గన్ షూటింగ్ టోర్నీ
న్యూఢిల్లీ: డేగు(దక్షిణకొరియా) వేదికగా జరుగుతున్న ఏషియా ఎయిర్‌గన్ షూటింగ్ టోర్నీలో భారత యువ షూటర్ ఇషాసింగ్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. టోర్నీలో ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో రజత పతకం దక్కించుకున్న ఇషా.. తాజాగా పసిడి పతకంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల జూనియర్ 10 మీటర్ల టీమ్ఈవెంట్ స్వర్ణ పోరులో భారత త్రయం ఇషాసింగ్, మను భాకర్, శిఖా నార్వల్ 16-12 తేడాతో కొరియాకు చెందిన కిమ్ మినేసో, కిమ్ జుహి, జిన్ యాంగ్‌పై అద్భుత విజయం సాధించింది.
అంతుకుముందు జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లోనూ భారత షూటర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పారిస్ (2024) ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యమే లక్ష్యం గా ముందుకెళుతున్న హైదరాబాదీ ఇషా.. చెదరని గురితో ఆకట్టుకుంటున్నది. పోటీకి దిగిన ప్రతీ టోర్నీలో సత్తాచాటుతూ పతకాలు కొల్లగొడుతున్నది. 17 ఏండ్ల ప్రాయంలోనే మేటి షూటర్లకు దీటైన పోటీనిస్తూ తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నది.