దుబాయ్: వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో పురుషులతో సమానంగా మహిళలకూ ప్రైజ్ మనీ ఇవ్వనుంది. తదుపరి పొట్టి ప్రపంచకప్ ఎడిషన్ నుంచే ఇది అందుబాటులోకి రానుంది. అక్టోబర్ నుంచి జరుగబోయే మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో టైటిల్ గెలిచిన విజేతకు ప్రైజ్‌మనీగా 2.34 యూఎస్ మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.19 కోట్లు) దక్కనున్నాయి. గత ఎడిషన్‌తో పోల్చి తే ఇది 134 శాతం అధికం. రన్నరప్‌గా నిలిచే జట్టుకు 1.17 యూఎస్ మిలియన్ డాలర్లు (రూ.9.8 కోట్లు) అందుతాయి. 2022లో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాకు 1 యూఎస్ మిలియన్ డాలర్ల (రూ.8.37 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది.