Kate Cross | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యాషెస్ విజేత..!
Kate Cross : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ కేట్ క్రాస్(Kate Cross) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. నిరుడు ఇంగ్లండ్ వేల్స్ బోర్డు కాంట్రాక్ట్ చేజార్చుకున్న కేట్... 34 ఏళ్ల వయసులో ఆటకు అల్విదా చెప్పేసింది.
Kate Cross : ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ కేట్ క్రాస్(Kate Cross) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. నిరుడు ఇంగ్లండ్ వేల్స్ బోర్డు కాంట్రాక్ట్ చేజార్చుకున్న కేట్.. 34 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ఆటకు సైతం అల్విదా చెప్పేసింది. ల్యాంక్‌షైర్ జట్టు తరఫున దేశవాళీ సీజన్ ఆడిన ఈ పొడగరి పేసర్ సీజన్ ముగియడమే ఆలస్యం రిటైర్మెంట్ వార్తను ప్రకటించింది.
అంతర్జాతీయంగా ఇంగండ్కు, దేశవాళీలో ల్యాంక్‌షైర్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన కేట్ క్రాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 13 ఏళ్లకే ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడిన కేట్.. పేస్ బౌలర్‌గా 2013లో ఇంగ్లండ్ జట్టుకు ఎంపికైంది. అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే యాషెస్ సిరీస్ విజయంలో కీలకమైందీ స్పీడ్‌స్టర్. 2014 పెర్త్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో (3-35) మూడేసి వికెట్లు తీసిన కేట్ ఆస్ట్రేలియా ఓటమికి కారణమైంది. అనంతరం.. ఇంగ్లండ్ బోర్డు ఆమెతో పాటు 18 మందికి తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది.
Kate Cross has announced her retirement from all forms of cricket at the end of the English season.
Cross, who lost her England contract last year, represented her country 102 times and claimed 140 wickets in her 12-year international career 👏 pic.twitter.com/52MO4mjrmD
— Cricinfo (@cricinfo) August 21, 2026
దాదాపు పదేళ్లకు పైగా సాగింది కేట్ క్రాస్ అంతర్జాతీయ కెరీర్. అయితే.. నిరుడు సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు జాతీయ జట్టులో చోటూ కోల్పోయిన తను.. 2026లో ల్యాంక్షైర్తో ఏడాది కాలానికి ఒప్పందం చేసుకుంది. అయితే.. అనూహ్యంగా సీజన్ ముగియడంతో పూర్తిగా ఆట నుంచి వైదొలుగుతున్నానని వెల్లడించింది.
‘ఇన్నిరోజులు నాకు మద్దుతగా నిలిచిన కుటుంబం, స్నేహితులకు, సహచరులకు ధన్యవాదాలు. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశా. కష్ట సమయాల్లో అండగా ఉన్న కోచ్‌లకు కృతజ్ఞతలు. నా కెరీర్ ఆసాంతం ల్యాంక్‌షైర్ అందించిన మద్దతు మరువలేను’ అని కేట్ పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో 102 మ్యాచులు ఆడిన కేట్ 140 వికెట్లు తీసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

