Alastair Cook | ఇంగ్లండ్ పర్యటనకు సూర్యవంశీనా.. ఇంతకూ పాస్‌పోర్ట్ ఉందా?
Alastair Cook : అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ అరంగేట్రానికి సమయం వచ్చేసిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (Alastair Cook) ఇంతకూ వైభవ్‌కు పాస్‌పోర్టు ఉందా? అని జోక్ చేశాడు.
Alastair Cook : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో వీరకొట్టుడు కొడుతున్న భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పేరు ప్రపంచమంతా మార్మోగుతోంది. వరల్డ్ క్లాస్ బౌలర్లను ఎడాపెడా ఉతికేస్తున్న ఈ పదిహేనేళ్ల కుర్రాడి ఆటకు దిగ్గజాలు సైతం ఫిదా అవుతున్నారు. ఏ నలుగురు ఓ చోట చేరినా మనోడి గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేనా.. అంతర్జాతీయ క్రికెట్లో వైభవ్ అరంగేట్రానికి సమయం వచ్చేసిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ (Alastair Cook) ఇంతకూ వైభవ్‌కు పాస్‌పోర్టు ఉందా? అని జోక్ చేశాడు.
అండర్ -19 హీరోగా వెలుగు వెలుగుతున్న వైభవ్ సూర్యవంశీని సీనియర్ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఐపీఎల్లో బుమ్రా, బౌల్ట్, సిరాజ్, రబడ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఉతికేసిన ఈ కుర్రాడిని ఇంగ్లండ్ పర్యటనలో ఆడించాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్ అన్నీ సరే ఇంతకూ వైభవ్‌కు పాస్‌పోర్టు ఉందా? అని జోక్ చేశాడు. ‘స్టిక్ టు క్రికెట్'(Stick To Cricket) అనే పాడ్‌కాస్ట్ షోలో మైఖేల్ వాన్(Michael Vaughn) సహా పలువురు వైభవ్ గురించి ప్రస్తావించగా కుక్ ఇలా స్పందించాడు.
Does Vaibhav have a passport? Cook’s cheeky take on Sooryavanshi’s India selection
Read: https://t.co/E4bqXk3Or9 pic.twitter.com/fn5TgbbSeV
— IndiaToday (@IndiaToday) April 24, 2026
‘ఐపీఎల్లో వైభవ్ 236 స్ట్రయిక్ రేటుతో ఇప్పటికే 246 రన్స్ కొట్టాడు. అతడు ఏమాత్రం స్కూల్ కుర్రాడు కాదు. అతడు ఐర్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడుతాడని అనుకుంటున్నా. ఈ వేసవిలో ఇంగ్లండ్ పర్యటనకు వచ్చే భారత జట్టులో వైభవ్ ఉండాలని నేను ఆశిస్తున్నా’ అని వాన్ పేర్కొన్నాడు. ఆ వెంటనే అందుకున్న కుక్ ‘మరి వైభవ్‌కు పాస్‌పోర్టు ఉందా’ అని సరదాగా అన్నాడు.

అందుకు వాన్.. ‘వయసు అనేది అడ్డంకి కావొద్దు. వైభవ్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. పదిహేనేళ్లకే అతడు బుమ్రా ఓవర్లో సిక్సర్ బాదడం మామూలు విషయం కాదు. బుమ్రాను సాధారణ బౌలర్‌గా ఎదుర్కొన్న అతడు అద్భుతమైన క్రికెటర్’ అని బదులిచ్చాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లడ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే.. వైభవ్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారా? అనేది తెలియదు. కానీ, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు మాత్రం తీసుకునే అవకాశముందని సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

