న్యూఢిల్లీ: ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య జరిగిన అండర్ 19 క్రికెట్లో ఓ వింత ఘటన చోటుచేసుకున్నది. ఇంగ్లండ్ బ్యాటర్ ఆర్యన్ సావంత్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. బహుశా వరల్డ్ క్రికెట్లో ఇలాంటి రనౌట్( Run Out) ఎవరూ చూసి ఉండరు. ఇండ్లండ్, సౌతాఫ్రికా అండర్19 జట్ల మధ్య జరిగిన అనధికార టెస్టు మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. సౌతాఫ్రికా బౌలర్ జేసన్ రౌల్స్ వేసిన బంతిని.. బ్యాటర్ ఆర్యన్ క్లీన్ స్వీప్ చేశాడు. చాలా బలంగా ఆ షాట్ కొట్టాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ మోకాలికి బంతి తగిలి అది రివర్స్ వచ్చింది. ఆ రివర్స్‌లో బంతి నేరుగా వికెట్లకు తగిలింది. అయితే షాట్ కొట్టే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి క్రీజ్ బయటకు వెళ్లాడు బ్యాటర్. క్రీజ్‌లో లేని కారణంగా బ్యాటర్ ఔటైనట్లు ప్రకటించారు. రనౌట్‌గా దాన్ని చిత్రీకరించారు.
తొలుత బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్‌కు చెందిన హెల్మెట్ తగిలి.. అది రివర్స్‌లో వికెట్లకు తగిలినట్లు అనిపించింది. అయితే బంతి తగలగానే ఫీల్డర్ కింద కుప్పకూలాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలియలేదు. కానీ రిప్లేలు పదేపదే పరిశీలిస్తే, ఆ బంతి ఆ ఫీల్డర్ మోకాలికి బలంగా తగలి, రివర్స్ వచ్చినట్లు గుర్తించారు. బంతి మోకాలికి తగలడంతో.. ఫీల్డర్ వాన్ తీవ్ర ఇబ్బందిపడ్డాడు. నొప్పి తట్టుకోలేక కిందపడిపోయాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 299 రన్స్ చేయగా, సౌతాఫ్రికా 319 రన్స్ చేసింది. ఇక మూడవ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 275 రన్స్ చేసి 255 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
You have seen catches being taken after the ball was struck into the helmet of a short leg fielder
BUT
Have EVER seen someone runout off the helmet of a short leg fielder? 😱🤯 pic.twitter.com/5PEgAKUr0c
— Werner (@Werries_) January 29, 2025