సిడ్నీ: ప్రతిష్ఠాత్మక ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన సెమీస్‌లో ఇంగ్లండ్ 3-1 తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే ఇరు జట్లు గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. 70 వేల మంది కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున ఎల్లా టూన్(36ని), లారెన్ హెంప్(71ని), అలీస్సా రూసో(86ని) గోల్స్ చేశారు. మరోవైపు సామ్ కెర్(63ని) ఆసీస్‌కు ఏకైక గోల్ అందించింది.