Sven Goran Eriksson | ‘నాకు క్యాన్సర్ ఉంది.. ఏడాది బతుకుతానంతే’ : ఇంగ్లండ్ మాజీ కోచ్
Sven Goran Eriksson : ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కోచ్ స్వెన్ గోరన్ ఎరిక్సన్(Sven Goran Eriksson) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు క్యాన్సర్ ఉందని, ఎక్కువ రోజులు బతకనని 75 ఏండ్ల ఎరిక్సన్ తెలిపాడు. దాంతో ఫ్యాన్స్ నిజమా? అని...
Sven Goran Eriksson : ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కోచ్ స్వెన్ గోరన్ ఎరిక్సన్(Sven Goran Eriksson) అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు క్యాన్సర్ ఉందని, ఎక్కువ రోజులు బతకనని 75 ఏండ్ల ఎరిక్సన్ తెలిపాడు. దాంతో ఫ్యాన్స్ ‘నిజమా?’ అని ఆశ్చర్యపోతున్నారు. స్వీడన్‌కు చెందిన ‘రేడియో 1’లో మాట్లిడిన ఎరిక్సన్.. ‘నాకు జబ్బు చేసిందనే విషయం అందరికీ తెలుసు. అది క్యాన్సర్ అని వాళ్లకు తెలుసు. అయితే.. నిర్ధారించుకునేందుకు సమయం పట్టింది’ అని తెలిపాడు.
‘నేను ఈమధ్య ఒక్కసారిగా కిందపడిపోయాను. అనంతరం టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పారు. ఏడాది మాత్రమే బతికే అవకాశముందని చెప్పారు. ఆరోగ్యం సహకరించడం లేదనే కారణంతోనే జనంతో కలవడం మానేశాను. సాధ్యమైనన్ని రోజులు ఆ మహమ్మారితో పోరాడుతాను’ అని వెల్లడించాడు.
ఇంగ్లండ్ జట్టుకు తొలి విదేశీ కోచ్‌గా గుర్తింపు పొందిన ఎరిక్సన్ నాలుగేండ్ల పాటు సేవలందించాడు. డేవిడ్ బెక్‌హమ్, స్వీవెన్ గెర్రాడ్, వేన్ రూనీ వంటి స్టార్ ఆటగాళ్లకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. అతడి హయాంలో ఇంగ్లండ్ 2002, 2006 వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడింది.

అయితే.. రెండు పర్యాయాలు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమితో ఇంటిదారి పట్టింది. ఇక 200 4లో జరిగిన యూరోపియన్ చాంపియన్‌షిప్స్‌లోనూ ఇంగ్లండ్ క్వార్టర్స్‌లో వెనుదిరిగింది. బెన్ఫికా, రోమాతో పాటు మాంచెస్టర్ సిటీ క్లబ్‌లకు ఎరిక్సన్ కోచ్‌గా పనిచేశాడు. అతడు చివరిసారిగా 2018-19లో ఫిలీప్పీన్స్ జాతీయ జట్టుకు కోచ్‌గా సేవలందించాడు.
ఇవి కూడా చదవండి
- Malaysia Open | క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ – చిరాగ్ జోడీ.. రెండో రౌండ్లోనే శ్రీకాంత్ ఔట్
- Vande Bharat Train | వందే భారత్ ప్రయాణికులకు పాడైన ఆహారం.. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

