FIFA Worldcup: హోరాహోరీలో మెక్సికో ఔట్.. క్వార్టర్స్‌లోకి ఇంగ్లండ్ ఎంట్రీ
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు కథ ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. అజ్టెకా స్టేడియంలో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో 3-2 గోల్స్ తేడాతో మెక్సికో పరాజయాన్ని ఎదుర్కొన్నది. బెల్లింగ్‌హామ్ రెండు గోల్స్ చేశాడు.
మెక్సికో సిటీ: ఫిఫా వరల్డ్‌కప్(FIFA Worldcup)లో ఆతిథ్య జట్టు మెక్సికో కథ ముగిసింది. రౌండ్16 మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 3-2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. మెక్సికో జట్టు ఆఖరి నిమిషం వరకు తీవ్రంగా పోరాడింది. అయితే తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్‌ను గంట ఆలస్యంగా ప్రారంభించారు. స్వంత స్టేడియంలో ఆడుతున్న మెక్సికో ఇప్పటి వరకు 89 మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే అక్కడ ఓడింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చాలా చాకచక్యంగా గేమ్‌ను ప్రదర్శించింది.
ఇంగ్లండ్ ప్లేయర్ జూడే బెల్లింగ్‌హామ్ తొలి అర్థభాగంలో కేవలం 98 సెకన్ల తేడాతో రెండు గోల్స్ చేశాడు. 36, 38వ నిమిషాల్లో అతను గోల్స్ చేసి ఇంగ్లండ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. ఇంగ్లండ్ గోల్ కీపర్ జోర్డాన్ పిక్‌ఫోర్డ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించడు. రౌల్ జమినేట్ కొట్టిన రెండు అద్బుతమైన షాట్లను జోర్డాన్ పిక్‌ఫోర్డ్ అడ్డుకున్నాడు. కానీ మెక్సికో ప్లేయర్ జులియన్ క్విన్నోస్ గోల్ చేసి ఆ జట్టులో ఆశలు రేపాడు. ఇంగ్లండ్ ప్లేయర్ కేన్ 60వ నిమిషంలో గోల్ చేయగా, మెక్సికో తరపున 69వ నిమిషంలో జిమినేజ్ గోల్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

