Euro Cup: జర్మనీ వేదికగా నాలుగు వారాలుగా ఫుట్బాల్ ప్రేక్షకులను అలరిస్తున్న యూరో కప్ లో టైటిల్ పోరుకు వేళైంది. తొలి సెమీస్ లో ఫ్రాన్స్ ను స్పెయిన్ మట్టికరిపించగా గురువారం ఉదయం జరిగిన రెండో సెమీస్ లో ఇంగ్లండ్ 2-1తో నెదర్లాండ్స్ ను ఓడించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ తరఫున జేవీ సిమన్స్ 7వ నిమిషంలోనే గోల్ చేసి డచ్ జట్టును ఆధిక్యంలోకి తెచ్చాడు. కానీ ఇంగ్లండ్ త్వరగానే పుంజుకుంది. 18వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని హ్యారీ కేన్ సద్వినియోగం చేసుకుని ఆ జట్టుకు తొలి గోల్ అందించాడు .
ఆ తర్వాత ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా శ్రమించినా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. ఇక ఆట ముగుస్తుందనగా 90వ నిమిషంలో ఓలీ వాట్కిన్స్ గోల్ చేసి ఇంగ్లండ్ ను యూరో కప్ ఫైనల్ చేర్చాడు. ఫైనల్ చేరిన స్పెయిన్, ఇంగ్లండ్ శుక్రవారం టైటిల్ పోరులో తలపడనున్నాయి. 12 ఏండ్ల తర్వాత యూరో కప్ ఫైనల్ చేరిన స్పెయిన్ టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉండగా ఇంగ్లండ్ సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యూరో చాంపియన్ గా నిలవాలని భావిస్తోంది.
Spain 🆚 England
Berlin. Sunday.#EURO2024 pic.twitter.com/f1NqmQfOpO
— UEFA EURO 2024 (@EURO2024) July 10, 2024
కోపా అమెరికా ఫైనల్లో కొలంబియా
యూరో కప్ తో సమాంతరంగా జరుగుతున్న కోపా అమెరికా టోర్నీలో కొలంబియా జట్టు ఫైనల్ చేరింది. నేటి ఉదయం ఛార్లెంట్ లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో కొలంబియా 1-0తో ఉరుగ్వేను ఓడించి ఫైనల్లో అర్జెంటీనాను ఢీకొనేందుకు సిద్ధమైంది. ఈ ఇరుజట్ల మధ్య సోమవారం (జులై 15న) జరుగనుంది. మూడో స్థానం కోసం ఉరుగ్వే, కెనడా తలపడనున్నాయి. కాగా కొలంబియాతో మ్యాచ్ ఓడిపోయాక పలువురు ఉరుగ్వే ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు అభిమానులపై దాడికి దిగారు.
LA GRAN FINAL DE LA CONMEBOL COPA AMÉRICA USA 2024™ 🌟 pic.twitter.com/Iq7tqtiplb
— CONMEBOL Copa América™️ (@CopaAmerica) July 11, 2024