Ben Foakes | సుదీర్ఘ ఫార్మాట్లో వెయ్యి పరుగులు.. 12వ వికెట్ కీపర్ అతడే
Ben Foakes : భారత పర్యటనలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్(Ben Foakes) అద్బుతంగా రాణిస్తున్నాడు. వికెట్ల వెనకాల ఆకట్టుకుంటూనే బ్యాటుతోనూ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఫోక్స్ వైజాగ్ టెస్టు (Vizag Test)లో...
Ben Foakes : భారత పర్యటనలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్(Ben Foakes) అద్బుతంగా రాణిస్తున్నాడు. వికెట్ల వెనకాల ఆకట్టుకుంటూనే బ్యాటుతోనూ విలువైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఫోక్స్ వైజాగ్ టెస్టు (Vizag Test)లో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. ఇంగ్లండ్ తరఫున ఈ ఫార్మాట్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.
వైజాగ్ టెస్టుకు ముందు వెయ్యికి 28 పరుగలు దూరంలో ఉన్న ఫోక్స్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగుల వద్ద ఫోక్స్ టెస్టుల్లో 1,000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అతడి కంటే ముందు అలెక్ స్టెవార్ట్, అలన్ నాట్, మ్యాట్ ప్రియర్, జానీ బెయిర్‌స్టో, థామస్ గాడ్ఫ్రే ఎవాన్స్, లెస్లీ అమెస్, జాక్ రస్సెల్, జిమ్ పార్క్స్, జోస్ బట్లర్, గెరెంట్ జోన్స్, బాబ్ టేలర్ లు 1000 పరుగులు పూర్తి చేసుకున్నారు.
Milestone Alert!
Ben Foakes reaches 1000 Test Runs 🔥#INDvsENG pic.twitter.com/jL9YGZ6P6w
— Pullbet (@Pullbetofficial) February 5, 2024
బజ్ బాల్ ఆటతో ఉప్పల్ టెస్టులో గెలుపొందిన ఇంగ్లండ్‌కు వైజాగ్‌లో భారత బౌలర్లు కళ్లెం వేశారు. స్పిన్నర్లు అశ్విన్, కుల్దీప్, స్పీడ్‌స్టర్ బుమ్రా విజృంభించడంతో స్టోక్స్ సేన 229 రన్స్‌కే కుప్పకూలింది. బెన్ స్టోక్స్ తర్వాత వచ్చిన టామ్ హర్ట్లే(36)తో కలిసి బెన్ ఫోక్స్(36) భారత బౌలర్లను విసిగించాడు. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. అయితే.. బుమ్రా బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే హర్ట్లేను బౌల్డ్ చేసిన యార్కర్ కింగ్ భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.
ఇవి కూడా చదవండి
-
Rapper Mike: 3 గ్రామీ అవార్డులు గెలుచుకున్న మరుక్షణమే ర్యాపర్ అరెస్టు Pakistan | పోలీసు స్టేషన్‌పై ఉగ్రమూకల దాడి.. 10 మంది పోలీసులు మృతి -
Taylor Swift: గ్రామీల్లో టేలర్ స్విఫ్ట్ రికార్డు.. నాలుగోసారి బెస్ట్ ఆల్బమ్ అవార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

