Rapper Mike: 3 గ్రామీ అవార్డులు గెలుచుకున్న మరుక్షణమే ర్యాపర్ అరెస్టు
Rapper Killer Mike: ర్యాపర్ మైక్ ఈ ఏడాది మూడు గ్రామీలను గెలుచుకున్నాడు. అయితే ఇవాళ అవార్డు ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను లాస్ ఏంజిల్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతన్ని ఎందుకు అరెస్టు చేశారన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.
లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఇవాళ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఆ ఈవెంట్లో ర్యాపర్ కిల్లర్ మైక్(Rapper Mike) మూడు అవార్డులు గెలుచుకున్నాడు. అయితే స్టేజ్‌పై అవార్డులు అందుకున్న తర్వాత అతన్ని అక్కడ ఉన్న సెక్యూర్టీ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. 48 ఏళ్ల ఆ ర్యాపర్ పూర్తి పేరు మైఖేల్ రెండర్. ప్రస్తుతం అతను లాస్ ఏంజిల్స్ పోలీసులు ఆధీనంలో ఉన్నాడు. ప్రవర్తన సరిగా లేని కారణంగా 243(ఏ) పీసీ కింద అతన్ని అరెస్టు చేశారు. ఒకవైపు మ్యూజిక్ అవార్డ్స్ షో కొనసాగుతుండగానే.. అతని చేతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్లారు.
బెస్ట్ ర్యాప్ ఆల్బమ్, బెస్ట్ ర్యాప్ సాంగ్, బెస్ట్ ర్యాప్ పర్ఫార్మెన్స్ కేటగిరీల్లో ర్యాపర్ మైక్ అవార్డులు గెలుచుకున్నాడు. ఏ కారణం చేత అతన్ని అదుపులోకి తీసుకున్నారో స్పష్టంగా తెలియదు. కానీ అవార్డు అందుకున్న తర్వాత వేదిక వద్ద సెక్యూర్టీతో గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. అవార్డ్స్ షో జరుగుతున్న క్రిప్టో డాట్‌కామ్ ఏరినాలో ర్యాపర్ మైక్ గొడవపడ్డాడని, అందుకే అతన్ని అరెస్టు చేసినట్లు లాస్ ఏంజిల్స్ పోలీసులు వెల్లడించారు. సామాజిక న్యాయం, జాత్యహంకారం, నల్లవారికి చెందిన సమస్యల గురించి ర్యాపర్ మైక్ తన పాటల్లో పాడేవాడు.
Breaking: Rapper Killer Mike has been taken away in handcuffs in https://t.co/aF2yiyTHol arena after winning 3 #Grammys during telecast (Best Rap Song and Best Rap Performance for “Scientists & Engineers,” Best Rap Album for Michael) “Free Mike” someone shouts as he walks past. pic.twitter.com/4epfmzqMt8
— Chris Gardner (@chrissgardner) February 5, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

