అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్‌స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్‌స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్‌స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కోహ్లీ వైపు వెళ్లింది. దాన్ని అతడు సులభంగా అందుకోవడంతో బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ముగిసింది.
అంతకుముందు మూడో రోజు ఆట ఆరంభంలో కోహ్లీతో చిన్న గొడవ పడిన బెయిర్‌స్టో ఆ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించాడు. బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌తో ఫాలో ఆన్ ప్రమాదం తప్పించుకున్న ఇంగ్లండ్.. 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. ప్రస్తుతం శామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్ క్రీజులో ఉన్నారు.
Jonny Bairstow Gone Virat Kohli Takes a Catch Shami Pick Up 2nd 🔥✌🏼#ENGvIND || #ViratKohli pic.twitter.com/BKR4uifrdh
— Kohlity Shot 🤤🖤!! (@Shahroz_06) July 3, 2022