న్యూఢిల్లీ: ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ అంతర్జాతీయ వన్ డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేవలం 23 ఇన్నింగ్స్‌లోనే ఆరు సెంచరీలు చేసి ఔరా అనిపించాడు. వన్ డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ (140; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) కొట్టడం ద్వారా 36 ఏళ్ల మలాన్ ఈ ఘనత దక్కించుకున్నాడు.
డేవిడ్ మలాన్ కంటే ముందు పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ పేరిట ఈ రికార్డు ఉన్నది. హక్ 27 ఇన్నింగ్స్‌లో 6 సెంచరీలు చేశాడు. వీరి తర్వాత శ్రీలంక బ్యాటర్ ఉపుల్ తరంగ (29 ఇన్నింగ్స్), పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (32 ఇన్నింగ్స్), దక్షిణాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా (34 ఇన్నింగ్స్) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.