ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే పలుమార్లు డీఆర్ఎస్ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో రవిబిష్ణోయి వేసిన బంతిని బెంగళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సరిగా ఆడలేకపోయాడు.
ఆ బంతిని వికెట్ కీపర్ ఒడిసిపట్టడంతో పంజాబ్ జట్టు అప్పీల్ చేసింది. దీన్ని ఆన్‌ఫీల్డ్ అంపైర్ తోసిపుచ్చడంతో పంజాబ్ సారధి రాహుల్ డీఆర్ఎస్ కోరాడు. రీప్లేలో బంతి పడిక్కల్ గ్లౌవ్ దాటే సమయంలో శబ్దం వస్తున్నట్లు కనిపించింది. అయినాసరే థర్డ్ అంపైర్ కె. శ్రీనివాసన్ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. దేవ్‌దత్ ను నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం పట్ల పంజాబ్ సారధి రాహుల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్‌తో దీనిపై చర్చించాడు.
ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ థర్డ్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిల్యాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ అయితే చాలా కోపంగా, ‘‘ఆ థర్డ్ అంపైర్‌ను వెంటనే తొలగించండి’’ అంటూ ట్వీట్ చేశాడు. అతనేకాదు చాలామంది నెటిజన్లు థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
Sack the 3rd umpire immediately #SelectDugout
— Scott Styris (@scottbstyris) October 3, 2021
What a joke!
Terrible umpiring, mistakes like that is unforgivable with so much technology and help these days! #RCBvsPBKS #IPL2021
— Kris Srikkanth (@KrisSrikkanth) October 3, 2021