Womens T20 World Cup : మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుతం జరగలేదు. ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా(Australia) జోరుకు తలొగ్గిన ఇంగ్లండ్(England) కప్‌ను అప్పగించింది. లార్డ్స్ మైదానంలో ఆల్‌రౌండ్ షోతో రెచ్చిపోయిన ఆసీస్ రికార్డు స్థాయిలో ఏడోసారి పొట్టి కప్‌ను ముద్దాడింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 151 లక్ష్య ఛేదనలో బేత్ మూనీ(64), ఫొబో లిచ్ఫీల్డ్౦(48) ఉతికేశారు. పవర్ ప్లేలోనే 62 కొట్టిన కంగారూ టీమ్.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగోసారి పొట్టి కప్ ఫైనల్లో కంగుతిన్న ఇంగ్లండ్ సొంతగడ్డపై చెక్కుచెదరని రికార్డును చేజేతులా పోగొట్టుకుంది.
ఐసీసీ ఈవెంట్లలో తామెంత ప్రమాదకరమో ఆస్ట్రేలియా మరోసారి చాటింది. ఫైనల్ వెళ్తే కప్ వదలేది లేదు అన్నట్టు ఆడే ఆసీస్.. ఏడోసారి టీ20 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. లీగ్ దశ నుంచి ఓటమెరుగని ఇంగ్లండ్‌ను సొంతగడ్డపై మట్టికరిపించిన కంగారూ టీమ్ తమ స్టయిల్లో విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను బంతితో నిలువరించిన ఆస్ట్రేలియా బ్యాటతో రెచ్చిపోయింది. 151 పరుగుల మోస్తరు ఛేదనను ఆసీస్ దూకుడుగా మొదలెట్టింది.
Nat Sciver-Brunt and Beth Mooney both go clear of Suzie Bates with fifties in the #T20WorldCup final 🤝 pic.twitter.com/ggSA6HZCJB
— Cricinfo (@cricinfo) July 5, 2026
తొలి బంతినే బౌండరీకి పంపిన ఓపెనర్ జార్జియా వోల్(9)ను లారెన్ బెల్ బౌల్డ్ చేసి ఆదిలోనే బ్రేకిచ్చింది. కానీ, బిగ్ మ్యాచ్ ప్లేయర్ బేత్ మూనీ(64) ఒత్తిడికి లోనవ్వకుండా ఫొబే లిచ్‌ఫీల్డ్(48)తో కలిసి దంచేసింది. వీరిద్దరి ఉతుకుడుతో ఆసీస్ పవర్ ప్లేలో 62 పరుగులు చేసింది. శతక బాగస్వా్మ్యం నెలకొల్పిన లిచ్‌ఫీల్డ్‌ను డీన్ బౌల్డ్ చేసింది. కానీ, అప్పటికే ఆసీస్ విజయం వాకిట నిలిచింది. ఎలీసా పెర్రీ(13 నాటౌట్) జతగా లాంఛనం ముగించాలనుకున్న మూనీ ఎల్బీగా వెనుదిరిగింది. గార్డ్నర్(5 నాటౌట్) బౌండరీతో ఆసీస్ ఏడు వికెట్లతో విజయం సాధించింది.
టాస్ ఓడిన ఇంగ్లండ్‌కు ఫైనల్లో శుభారంభం దక్కలేదు. ఓపెనర్ అమీ జోన్స్(6)ను ల్యూసీ హామిల్టన్ ఔట్ చేయగా.. డేంజరస్ డాని వ్యాట్ హొడ్గే(8) సైతం విఫలమైంది. టపటపా రెండు కీలక వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్(58 నాటౌట్) బాధ్యతగా ఆడింది. ఒత్తిడిలోనూ ధనాధన్ ఆడిన అలలీసే క్యాప్సే(23) ఆసీస్ బౌలర్ల లయను దెబ్బతీసింది. అయితే.. గార్డ్నర్ వేసిన 9 ఓవర్లో క్యాప్సే 6, 4, 4 తో 16 రన్స్ పిండుకోగా స్కోర్ 60 దాటింది. అదే విధంగా ధాటిగా ఆడే క్రమంలో మొలినెక్స్ వేసిన బంతిని స్కూప్ చేయబోయి క్యాప్సే బౌల్డయ్యింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే హీథర్ నైట్(2) వికెట్ల ముందు దొరికిపోయింది. అంతే.. ఇంగ్లండ్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.
🏏 𝟏𝐒𝐓 𝐈𝐍𝐍𝐈𝐍𝐆𝐒 🏏
ENGLAND 🏴 1️⃣5️⃣0️⃣-4️⃣ (20 ov) vs AUSTRALIA 🇦🇺 | CRR : 7.5
Nat Sciver-Brunt* : 58 (53)
Freya Kemp* : 44 (28)Kim Garth : 1-20 (4)
AUSTRALIA 🇦🇺 NEED 1️⃣5️⃣1️⃣ RUNS TO WIN#ENGvAUS #AUSvENG #ENGWvAUSW #Final #Australia #Englandpic.twitter.com/zO1liQWvfC https://t.co/Ue3E5oAkpX
— Cricket Lover 🏏 (@Crick97924Lover) July 5, 2026
చూస్తుండగానే నాలుగు వికెట్లు పడినా.. కెప్టెన్ బ్రంట్ పట్టువదల్లేదు. ఫ్రెయా కెంప్(44 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించింది. తొలుత సింగిల్స్, డబుల్స్ తీసిన కెంప్ కాస్త కుదురుకున్నాక బౌండరీలతో స్కోర్ వేగం పెంచింది. సథర్లాండ్ ఓవర్లో తను రెండు ఫోర్లు బాదగా స్కోర్ వందకు చేరింది. ధాటిగా ఆడి 37 బంతుల్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిందీ జంట. మొలినెక్స్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో కెంప్ స్ట్రెయిట్ సిక్సర్‌తో ఆతిథ్య జట్టు 4 నష్టానికి 150 పరుగులు చేయగలిగింది.