Team India | టీ20ల్లో తిరుగులేని భారత్.. వైజాగ్ స్టేడియంలో ఘనమైన రికార్డు?
Team India : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిని మర్చిపోకముందే టీమిండియా(Team India) మరో సిరీస్‌కు సిద్ధమైంది. టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్(SKY) నేతృత్వంలోని యువ భారత్.. చాంపియన్ ఆస్ట్రేలియా(Australia)ను పొట్టి సిరీస్‌లో ఢీకొననుంది. గత రికార్డులు తిరగేస్తే.. ఆసీస్‌పై భారత్ పైచేయి సాధిస్తూ...
Team India : వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిని మర్చిపోకముందే టీమిండియా(Team India) మరో సిరీస్‌కు సిద్ధమైంది. టీ20 సంచలనం సూర్యకుమార్ యాదవ్(SKY) నేతృత్వంలోని యువ భారత్.. చాంపియన్ ఆస్ట్రేలియా(Australia)ను పొట్టి సిరీస్‌లో ఢీకొననుంది. విశాఖపట్నం వేదికగా ఈరోజు సాయంత్ర 7 గంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది. గత రికార్డులు తిరగేస్తే.. ఆసీస్‌పై భారత్ పైచేయి సాధిస్తూ వస్తోంది. అంతేకాదు ఈమధ్య కాలంలో మూడు టీ20 సిరీస్‌లు జరిగితే.. టీమిండియా రెండు సిరీస్‌లు సొంతం చేసుకుంది.
ఇప్పటివరకూ ఇరుజట్లు 26 టీ20లు ఆడాయి. టీమిండియా రికార్డుస్థాయిలో 15 మ్యాచుల్లో గెలవగా.. కంగారూ జట్టు 10 విజయాలకే పరిమితమైంది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఆసీస్‌పై నిరుడు సెప్టెంబర్‌లో భారత జట్టు అత్యధిక టీ20 స్కోర్ చేసింది. 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు కొట్టింది. పైగా విశాఖలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది.

ఈ వేదికపై ఆడిన మూడు మ్యాచుల్లో భారత్ రెండింట గెలిచింది. వైజాగ్ పిచ్‌పై భారత్ అత్యధిక స్కోర్.. 179/5. నిరుడు జూన్ 14న దక్షిణాఫ్రికాపై నమోదు చేసింది. అత్యల్ప స్కోర్ ఎంతో తెలుసా..? 126/7. ఈ గ్రౌండ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఇప్పటివరకూ పొట్టి క్రికెట్లో వైజాగ్ గడ్డపై భారత్‌కు ఇదే భారీ విజయం.
ఐపీఎల్ హీరోలు అదరగొట్టేనా.?
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా వైజాగ్‌లో తొలి మ్యాచ్ ఆడనున్నాయి. వరల్డ్ కప్‌లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్ తనకు అచ్చొచ్చిన పొట్టి సిరీస్‌లో దంచికొట్టాలనే కసితో ఉన్నాడు. ఇక ఐపీఎల్ 16వ సీజన్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రకంపనలు సృష్టించిన యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివం దూబే ఆసీస్ బౌలర్ల పని పట్టేందుకు ఎదురుచూస్తున్నారు.
భారత జట్టు అంచనా : ఇషాన్‌కిషన్, రుతురాజ్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్‌వర్మ, శివమ్‌దూబే, రింకూసింగ్, అక్షర్‌పటేల్/సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌సింగ్, ప్రసిద్ద్ కృష్ణ/అవేశ్‌ఖాన్, ముకేశ్‌కుమార్.
ఆస్ట్రేలియా జట్టు అంచనా : స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, హార్డీ, జోష్ ఇంగ్లిస్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కెప్టెన్), సియాన్ అబాట్, నాథన్ ఎల్లిస్, బెహెన్‌డార్ఫ్, సంగా.
ఇవి కూడా చదవండి
Vijay Hazare Trophy | దేశవాళీ క్రికెట్లో మయాంక్, హుడా శతకాల మోత
Marlon Samuels | వెస్టిండీస్ మాజీ క్రికెటర్‌కు భారీ షాక్.. 6 ఏండ్ల నిషేధం విధించిన కోర్టు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

