WTC Final – Dukes ball | డబ్ల్యూటీసీ ఫైనల్లో డ్యూక్స్ బాల్.. ఈ బంతి ప్రత్యేకత ఏంటంటే..?
WTC Final -Dukes ball : టెస్టు ఫార్మాట్‌కు వన్నె తెచ్చిన ప్రపంచ టెస్టు చాంపినయన్షిప్(WTC 2023) ఫైనల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మేటి జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ఆస్తక్తికరంగా ఉండనుంది. ఈ గేమ్‌లో ప్రత్యేకమైన బంతిని ఉపయోగించనున్నారు. అవును.. దాని పేరు డ్యూక్స్ బాల్(Dukes ball). మామూలుగా టెస్టుల్లో వాడే ఎస్జీ(Sanspareil Greenlands) బాల్ కంటే ఇది...
WTC Final -Dukes ball : టెస్టు ఫార్మాట్‌కు వన్నె తెచ్చిన ప్రపంచ టెస్టు చాంపినయన్షిప్(WTC 2023) ఫైనల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోర సాధన చేస్తున్నాయి. మేటి జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ఆస్తక్తికరంగా ఉండనుంది. ఈ గేమ్‌లో ప్రత్యేకమైన బంతిని ఉపయోగించనున్నారు. అవును.. దాని పేరు డ్యూక్స్ బాల్(Dukes ball). మామూలుగా టెస్టుల్లో వాడే ఎస్జీ(Sanspareil Greenlands) బాల్ కంటే ఇది చాలా స్పెషల్. చూడ్డానికి ఒకేలా కనిపించే ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడాలు ఉంటాయి. అవేంటో తెలుసా..?
డ్యూక్స్ బంతికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. క్రికెట్ ఆట పుట్టిన తొలినాళ్లలో అంటే.. 1760లో ఈ బాల్‌ను ఉపయోగించేవారట. ఇప్పటికీ 250 ఏళ్లు గడిచినా కూడా డ్యూక్స్ బాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. దీనికి, మామూలుగా టెస్టుల్లో ఉపయోగించే ఎర్ర బంతికి చాలా తేడా ఉంటుంది. దీన్ని ఇంగ్లండ్‌లోని డ్యూక్స్ క్రికెట్ కంపెనీ తయారుచేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీని భారత వ్యాపరవేత్త దిలీప్ జజోడియా(Dilip Jajodia) నడిపిస్తున్నాడు. ఎస్జీ రకం బంతులను మీరట్‌కు చెందిన కంపెనీ 1950 నుంచి తయారు చేస్తోంది. టెస్టులు ఆడే మిగతా దేశాలు ఆస్ట్రేలియాలో తయారైన కొకాబుర్రా బంతులను వాడతాయి.

మెరపు కోల్పోదు.. దృఢత్వం ఎక్కువే
డ్యూక్స్ బాల్ తొందరగా మెరుపును కోల్పోదు. అదే ఎర్ర బంతి అనుకోండి కొంచెం సేపటికే పాతబడిపోతుంది. ఈ రెండు రకాల బంతులకు చేతితోనే కుట్లు వేస్తారు. దాంతో, ఇవి ఎక్కువ స్వింగ్ అవుతాయి. డ్యూక్స్ బాల్ రెండు వైపులా వెనక నుంచి ముందుకు ఆరు కుట్లు కనిపిస్తాయి. దాంతో, ఆ బంతి ఎక్కువ సేపు తన ఆకారాన్ని కోల్పోదు. దృఢంగా కూడా ఉంటుంది. అయితే.. ఎర్ర బంతి మీద దారం పోగులు దగ్గర దగ్గరగా ఉంటాయి.
ఐపీఎల్లో ప్రాక్టీస్
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉపయోగించే డ్యూక్స్ బాల్ భారత ఆటగాళ్లకు కొత్తేమీ కాదు. ఎందుకంటే..? ఫైనల్లో ఆ బంతిని ఉపయోగిస్తారని తెలియగానే మనవాళ్లు దాంతో ఐపీఎల్లో ప్రాక్టీస్ చేశారు. ఈ విషయాన్ని ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈమధ్యే వెల్లడించాడు. ‘ఐపీఎల్ ప్రారంభానికి ముందే డబ్ల్యూటీసీ ఫైనల్లో డ్యూక్స్ బాల్ వాడతారనే విషయం మాకు తెలిసింది. అందుకని మేము ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. దాంతో, ప్రాక్టీస్ చేశాం. ఆ బంతిని ఎలా ఎదుర్కోవాలి? దాంతో, స్వింగ్‌ను ఎలా రాబట్టాలి? అనేది తెలుసుకున్నాం’ అని అక్షర్ తెలిపాడు.
డ్యూక్స్ బంతితో నెట్స్‌లో సాధన చేస్తున్న అక్షర్ పటేల్

ఇవి కూడా చదవండి
Nathan Lyon | భారత్‌తో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చాలా ప్రత్యేకం : లియాన్
Matheesha Pathirana | ఐపీఎల్ ప్రదర్శనతో శ్రీలంక జట్టులోకి.. వన్డేల్లో ఆరంగ్రేటం చేయనున్న పథిరన
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

