మెల్బోర్న్: టెన్నిస్ స్టార్, వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్కు విముక్తి లభించింది. ఆస్ట్రేలియా కోర్టు ఇవాళ సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. వీసా రద్దు కేసులో జోకోవిచ్కు అనుకూల తీర్పు వచ్చింది. దీంతో ప్రస్తుతం డిటెన్షన్ సెంటర్లో ఉన్న జోకోవిచ్ రిలీజ్ కానున్నారు. అకారణంగా జోకో వీసాను రద్దు చేశారని, ఆ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు చెప్పింది. కోర్టు తన తీర్పుతో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెక్ పెట్టింది. వీసా కేసులో నెగ్గిన జోకోవిచ్ ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడేందుకు లైన్ క్లియరైంది. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో మళ్లీ అప్పీల్ చేయనున్నట్లు ఆ దేశ మంత్రి తెలిపారు. జోకో వీసా రద్దు కోసం ఇమ్మిగ్రేషన్ కార్యాలయం చర్యలు చేపడుతుందని ప్రభుత్వం కోర్టులో వెల్లడించింది. ప్రభుత్వ లాయర్ ట్రాన్ ఈ విషయాన్ని తెలిపారు. ఒకవేళ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటే, అప్పుడు జోకోవిచ్ మూడేళ్ల పాటు ఆస్ట్రేలియా ఎంట్రీపై నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది.
కరోనా వ్యాక్సిన్ వేసుకోని జోకోవిచ్కు.. మినహాయింపు కల్పించడంపై ఆస్ట్రేలియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు జోకోవిచ్ మెల్బోర్న్ చేరుకున్నాడు. అయితే సరైన మినహాయింపు పత్రాలు లేవని అతని వీసాను ప్రభుత్వం రద్దు చేసింది. ఓ డిటెన్షన్ హోటల్లో అతన్ని ఉంచారు. దీంతో వీసా రద్దు అంశంపై జోకో కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వ పిటీషన్ను కోర్టు కొట్టివేసింది.