మంత్రి పదవి కోసమే ఢిల్లీ ప్రదక్షిణలు.. మాజీ మంత్రి తాటికొండ
కడియం శ్రీహరి తన కూతురిని వెంటబెట్టుకుని ఢిల్లీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చకర్లు కొట్టేది ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని, కేవలం తన మంత్రి పదవి కోసమేనని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు.
- నియోజకవర్గానికి కడియం చేసింది శూన్యం
- అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
- దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కడియం శ్రీహరి తన కూతురిని వెంటబెట్టుకుని ఢిల్లీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చకర్లు కొట్టేది ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని, కేవలం తన మంత్రి పదవి కోసమేనని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆరోపించారు. మంత్రి పదవి కోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారారని, 25 మంది ఎమ్మెల్యేలు తన వెంట వస్తే మంత్రి పదవి ఇస్తామన్న ఆశతో కాంగ్రెస్‌లోకి వెళ్తే, తీరా పది మంది కూడా వెళ్లకపోవడంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయని మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. తాను దళితుడనని చెప్పుకొనే కడియం శ్రీహరి, ఘనపూర్ లేదా పర్వతగిరిలో దళితుల కోసం చేసింది ఏమీ లేదని విమర్శించారు.
కులాన్ని అడ్డుపెట్టుకుని అన్ని రాజకీయ పదవులు అనుభవించినా, ఏ ఒక దళితుడిని ఎదిగేలా చేయలేదని మండిపడ్డారు. కడియం సాధించింది ఏమైనా ఉందంటే అది ఒక ‘దళిత దొర’ బిరుదు మాత్రమేనని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై మాటిమాటికీ విమర్శలు చేయడం మానుకోవాలని, సిగ్గు, శరం ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి రావాలని సవాల్ విసిరారు.
తాను జనగామ జిల్లా ఏర్పాటు, ఘనపూర్ రెవెన్యూ డివిజన్, హెల్త్ యూనివర్సిటీ, ఫె్లైఓవర్ బ్రిడ్జి, పాలిటెక్నిక్, మహిళా డిగ్రీ కళాశాలలు, కస్తూర్బా పాఠశాలలు, చెరువుల మరమ్మతులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణాలు కేసీఆర్ ఆశీస్సులతోనే సాధ్యమయ్యాయని వివరించారు. కడియం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అంబేదర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

